తెలంగాణ రాష్ట్ర 72వ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
వనపర్తి
వనపర్తి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 72వ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నేడు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి వివి రమణ, వనపర్తి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పి మన్మోహన్రావు, వెంకట్రామిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ గౌడ్ లు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో పాల్గొన్న క్రీడాకారులు ఎందరో వనపర్తి లో జరిగిన స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ చిన్నతనం నుండే బాల్ బాడ్మింటన్ లో ప్రతిభను కనబరుస్తున్న క్రీడాకారులను ముందుగా అభినందించారు. క్రీడల వల్ల శారీరక దృఢవత్వమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా వారికి లభిస్తుందని తద్వారా వారు విద్యపై గాని ఇతర విధులపై గాని మనసులను లగ్నం చేసే అవకాశం మెండుగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర టీం నుండి జాతీయస్థాయిలో పాల్గొని బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమ ప్రతిభను చాటి ట్రోఫీని అందుకునే ప్రయత్నం చేయాలని సూచించారుఅసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి వి రమణ, వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మన్మోహన్రావు, వెంకటరామిరెడ్డిలు వనపర్తి లో జరుగుతున్న టోర్నమెంట్లో రాష్ట్రం నలుమూలల నుండి ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. క్రీడాకారులు, ఎంపైర్లు, సెలెక్ట్ సెలెక్ట్ కమిటీ సభ్యులు, దాదాపు 250 మంది పాల్గొంటున్నారని వారు వివరించారు. టోర్నమెంట్లో విజేతల ఫలితాలను వనపర్తి జిల్లా బాల్పేట అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ గౌడ్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఉమ్మడి జిల్లా జట్టుపై నిజామాబాద్ జిల్లా జట్టు 35 -29 35-14 తేడాతో గెలుపొందింది.
ఖమ్మం జిల్లా జట్టుపై రంగారెడ్డి జిల్లా జట్టు 35-22, 35-14 తేడాతో విజయం సాధించింది. మహబూబ్నగర్ జిల్లా జట్టుపై వరంగల్ జిల్లా జట్టు 35-23, 35-10 పాయింట్లు తేడాతో విజయం సాధించింది.
మహిళా విభాగంలో మెదక్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ మొదటి రౌండ్ లలో ముందంజలో ఉన్నాయి.
పురుషుల విభాగంలో రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, జట్లు సెమీఫైనల్కు చేరనున్నాయి.
మహిళా విభాగంలో వరంగల్ ,ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జట్లు సెమి ఫైనల్ చేరనున్నాయి
