డా” నందిని సిద్ధారెడ్డి సాహిత్య సమాలోచన గ్రంథావిష్కరణ సభలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
తెలంగాణ సాహిత్య అకాడమీలో నిర్వహించిన సుప్రసిద్ధ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి “సాహిత్య సమాలోచన” గ్రంథావిష్కరణ సభలో వ్యవసాయ శాఖ మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా, గ్రంథావిష్కర్తగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రంథాన్ని ఆవిష్కరించి, తెలుగు సాహిత్యానికి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అందిస్తున్న సేవలను అభినందించారు. సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ సభలో సుప్రసిద్ధ సాహిత్యవేత్తలు ఆచార్య మృణాళిని, ఆచార్య కోయ కోటేశ్వర్, నాలేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
