భారత దేశం సమస్త రంగాల సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ…
మోడీ సర్కార్ గద్దె దిగాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి కే.విజయ రాములు
వనపర్తి
సకల సంపదలు గల భారతదేశం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలతో దేశంలోని సమస్త రంగాలు దివాలా తీస్తూ తీవ్రమైన సంక్షోభంలోకి వెళుతుందని సంక్షోభాలకు, ప్రజా తిరుగుబాట్లకు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే మోడీ సర్కార్ గద్దె దిగాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కే. విజయరాములు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రెండు రోజులగా జరుగుతున్న అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మహాసభలు నూతన జిల్లా కౌన్సిల్ ఎన్నిక, పలు తీర్మానాలతో ఘనంగా ముగిశాయి.ముగింపు మహాసభలో కె. విజయరాములు మాట్లాడుతూ:- విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు అందరిని ద్రాక్షగా మారిపోయాయని ముందు చూపులేని పాలకుల యువజన విధానంతో యువత శక్తి యుక్తులు నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఏట రెండు కోట్ల ఉద్యోగాలని హామీ ఎక్కడని నిలదీశారు. పరీక్ష పేపర్ల లీకేజీ సంఘటనపై దేశ విద్యార్థి యువత చేస్తున్న సమరశీల పోరాటం నేటి ప్రజా ఉద్యమాలకు ఎంతో ఆదర్శప్రాయం అని అన్నారు. సమాజ మార్పుపై భగత్ సింగ్ నుండి మొదలుకొని నేటి వరకు విద్యార్థి యువత లేని ఏ పోరాటం విజయం సాధించలేదని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని అప్పుడే దేశ రాజకీయ వ్యవస్థ లక్ష్యాలను జరగడం సాధ్యమని పిలుపునిచ్చారు. అనంతరం నూతన వనపర్తి జిల్లాలో పరిశ్రమల నెలకొల్పి స్థానికులకు 80 శాతం యువతకు ఉపాధి కల్పించాలని, స్వయం ఉపాధి రుణాలు ఇలాంటి బ్యాంక్ ఈశ్వర్ రెడ్డి లేకుండా అర్హులైన వారందరికీ ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని, ప్రభుత్వ శాఖల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తదితర తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బిజ్జ.శ్రీనివాస్, మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.సురేష్, ఏఐవైఎఫ్ జిల్లా నేత జీ. రమేష్, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గోపాలకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా నేత వంశీ, ఏఐవైఎఫ్ వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
