వనపర్తి
పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ అధ్యక్షుడు రవి గారి కుమార్తె మౌనిక వివాహ ప్రథనం కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని వధువును అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గారి వెంట కౌన్సిలర్ శ్రీకర్ చింటూ, చిట్యాల రాము, గ్రామ మాజీ ఎంపీటీసీ మద్దిలేటి గోవిందు, ఖాదర్ బాషా, కురుమూర్తి, ముజీపు, యుగేందర్, ఆంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.