వనపర్తి
శనివారం సిఐటియు వనపర్తి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయం వనపర్తి లో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్యన్ రమేష్ అధ్యక్షతన నిర్వహించాము ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మండ్ల రాజు మాట్లాడుతూ కార్మికుల దీక్ష దినమైన మేడే వారోత్సవాలు మే 1 నుండి 7 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని, లేబర్ కోర్స్ రద్దు అయ్యే వరకు ఉద్యమిస్తామని అన్నారు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని, కార్మికుల శ్రమను పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని అన్నారు, 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా పోరాడుదమని, కార్మిక హక్కుల కోసం, ఎనిమిది గంటల పని దినం రక్షణ కోసం, ప్రతి కార్మికునికి 28 వేల వేతనం వచ్చే వరకు పోరాటం నిర్వహిద్దామని, మే డే ను ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించుకుందామని. ప్రతి మండల కేంద్రంలో మే 1న జెండా ఆవిష్కరణ సభలు నిర్వహించుకోవాలని కార్మికులకు తెలియజేశారు, మే డే స్ఫూర్తితో జిల్లాలో ఉన్న కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కార్మికులను కోరారు సమావేశానికి సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ బొబ్బిలి నిక్సన్, పుట్ట ఆంజనేయులు. ఎస్ రాజు, మదన్, సూర్యవంశం రాము, బాల గౌడు, కవిత, సునీత, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు