వనపర్తి
వనపర్తి టౌన్ రాజనగరం 12 వార్డు మరియు గోపాల్పేట మండల కేంద్రంలో మరియు తాడిపత్రి, పోల్క్ పహాడ్ గ్రామాలలో, రేవల్లి మండల కేంద్రంలో మహిళా సమైక్య, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రలను సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, కేంద్రం వద్ద రైతులు సేద తీరేందుకు నీడ, నీరు ఏర్పాటు చేయాలన్నారు. తేమ శాతం వచ్చిన వెంటనే వడ్లను కొనుగోలు చేయాలంటూ నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు, అధికారులు మహిళా సమైక్య సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
