VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

నిర్లక్ష్యానికి మారుపేరు మున్సిపల్ శాఖ

వనపర్తి

నిర్లక్ష్యానికి మారుపేరు మున్సిపల్ శాఖ పార్కుల పేరుతో కోటానుకోట్ల ఖర్చు నిర్వహణ మాత్రం శూన్యం…. సూరవరం ప్రతాపరెడ్డి పార్కు అందుకు నిదర్శనం అని ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు. మార్నింగ్ వాక్ లో వెళ్తున్న ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కు సూరవరం ప్రతాపరెడ్డి పార్క్ ను చూసి అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, ప్రజల సొమ్ము గాలికి వదిలేస్తూ, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న పత్రిక సంపాదకుడు, రచయిత, వనపర్తి మొదటి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి గారి పార్కు నిర్లక్ష్యంగా వదిలివేయడo చూస్తే అర్థమవుతుంది మిగతా పార్కుల పరిస్థితి అని అన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెంటనే పరిశీలించి పార్కును అభివృద్ధి చేయాలని, పార్కును అభివృద్ధి చేసి అక్కడ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేసి, మధ్యలో రేకులతో నీడ కల్పించాలని, ఈ పార్కును సీనియర్ సిటిజన్స్ కు అప్పజెప్పాలని దాని నిర్వహణ వారే చూసుకుంటారని, అఖిలపక్ష ఐక్యవేదిక తరపున జిల్లా కలెక్టర్ కి, ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేస్తున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక తరపున డాక్టర్ సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు.

whatsapp image 2026 04 27 at 9.52.26 am

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top