వనపర్తి
అపర భగీరథుడు మహర్షి భగీరథుని జయంతి సందర్భంగా 1మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలకు మారు పేరు భగీరథుడని కఠోర సాధనతో గంగను నేల మీదకు తెచ్చిన మహానుభావుడు భగీరథుడు అని కొనియాడారు. ప్రజల దాహార్తి తీర్చే మంచినీటి పథకానికి కె.సి.ఆర్ గారు మిషన్ భగీరథ అని నామకరణం చేసి స్పూర్తిగా నిలిచారని అన్నారు. మహనీయుల జయంతి కార్యక్రమాలకు కె.సి.ఆర్ హయాంలో ప్రత్యేక నిధులు కేటాయించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని అన్నారు. నివాళులు అర్పించిన వారిలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్,కౌన్సిలర్.మురళీ సాగర్,విష్ణు సాగర్,మర్రికుంట.శ్రీనివాస్,చిట్యాల.రాము తదితరులు ఉన్నారు.