VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

Uncategorized

వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పెబ్బేరు పెబ్బేరు పట్టణంలో పుల్లారెడ్డి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహేష్ & రాజేశ్వరి ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పెబ్బేరు పట్టణంలోని సహారాఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రంజిత్ & మనోజ్ఞ ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి వనపర్తి పట్టణం 2వ వార్డుకు చెందిన హౌదికారి రాజన్న గారి ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని గృహ యజమానులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబం సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంట పట్టణ పార్టీ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్, జిల్లా మీడియా సెల్ అధ్యక్షులు నందిమల్ల అశోక్, ప్రేమ్ నాథ్ రెడ్డి కౌన్సిలర్స్ పలస శ్రీకర్ గౌడ్, మాజీ కోఆప్షన్ ఇమ్రాన్, ప్రభాకర్,నాయకులు తదితరులు పాల్గొన్నారు

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి

వనపర్తి వనపర్తి జిల్లా కేంద్రంలోని కానాయపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీనివాస్ గారి కూతురు సుదీక్ష & అజయ్ సాగర్ గార్ల వివాహం ఎంబి గార్డెన్ లో ఘనంగా జరిగింది ఈ వివాహానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి , దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ,హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ వివాహానికి వారితోపాటు కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్ , కొత్తకోట మాజీ ఎంపీపీ గుంత మౌనిక , నందిమల్ల అశోక్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి Read More »

జానీమియా(బ్రాడ్ వే టైలర్)కుటుంబ సభ్యులను పరామర్శించిన రావుల

వనపర్తి ఇటీవల మరణించిన జానీమియా కుటుంబసభ్యులను గౌరవ రావుల చంద్రశేఖరరెడ్డి పరమార్శించినారు. ఈ సందర్భంగా రావుల జానీమియా గారి సతీమణి రహీమున్నిసా బేగం గారితో మాట్లాడుతూ జానీ బాయ్ నాకు అత్యంత ఆప్తుడు,సన్నిహితుడని వారు లేనిలోటు తీర్చలేనిదని అన్నారు. ఎప్పుడు ఏమి అవసరం ఉన్నా తాను తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. చింతకుంట. ఆంజనేయులును పరామర్శించిన రావుల. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకుంటున్న చింతకుంట.ఆంజనేయులు మరియు చింతకుంట.శ్రీనివాసులు గార్లను వారి ఇంటి దగ్గర పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆర్థిక సహాయం అందజేశారు. రావుల వెంట నందిమల్ల అశోక్,సయ్యద్. జెమిల్,నందిమల్ల.రమేష్,ముద్దుసార్ ,మోహన్,సంపత్ తదితరులు ఉన్నారు.

జానీమియా(బ్రాడ్ వే టైలర్)కుటుంబ సభ్యులను పరామర్శించిన రావుల Read More »

పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

వనపర్తి తహసిల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ ఆత్మకూర్ తహసిల్దార్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులు, సాదా బైనమా పెండింగ్ దరఖాస్తులు సహా ఇతర పెండింగ్ అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచడం కోసం సంబంధిత అధికారులు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు విషయంలో నిర్లక్ష్యం లేకుండా పని చేయాలని ఆదేశించారు. తహసిల్దార్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి, సాదా బైనమా దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే స్పందించాలన్నారు. గ్రామాల్లో జరుగుతున్న పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. అధికారుల మధ్య సమన్వయం పెంచి సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు. SIR ప్రక్రియ నేపథ్యంలో BLOలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన బుధవారం అదనపు కలెక్టర్ అమరచింత మండల పరిధిలోని నాగల కడుమూరు, పామిరెడ్డిపల్లి, ఈర్లదిన్నె గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. టార్పాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచడంలో సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. హమాలీలకు సంబంధించి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లోడింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో తహసిల్దార్ జె కే మోహన్, రెవెన్యూ అధికారులు, GPOలు పాల్గొన్నారు.

పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి Read More »

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

వనపర్తి వనపర్తి టౌన్ రాజనగరం 12 వార్డు మరియు గోపాల్పేట మండల కేంద్రంలో మరియు తాడిపత్రి, పోల్క్ పహాడ్ గ్రామాలలో, రేవల్లి మండల కేంద్రంలో మహిళా సమైక్య, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రలను సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, కేంద్రం వద్ద రైతులు సేద తీరేందుకు నీడ, నీరు ఏర్పాటు చేయాలన్నారు. తేమ శాతం వచ్చిన వెంటనే వడ్లను కొనుగోలు చేయాలంటూ నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు, అధికారులు మహిళా సమైక్య సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే Read More »

నిర్లక్ష్యానికి మారుపేరు మున్సిపల్ శాఖ

వనపర్తి నిర్లక్ష్యానికి మారుపేరు మున్సిపల్ శాఖ పార్కుల పేరుతో కోటానుకోట్ల ఖర్చు నిర్వహణ మాత్రం శూన్యం…. సూరవరం ప్రతాపరెడ్డి పార్కు అందుకు నిదర్శనం అని ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు. మార్నింగ్ వాక్ లో వెళ్తున్న ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కు సూరవరం ప్రతాపరెడ్డి పార్క్ ను చూసి అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, ప్రజల సొమ్ము గాలికి వదిలేస్తూ, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న పత్రిక సంపాదకుడు, రచయిత, వనపర్తి మొదటి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి గారి పార్కు నిర్లక్ష్యంగా వదిలివేయడo చూస్తే అర్థమవుతుంది మిగతా పార్కుల పరిస్థితి అని అన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెంటనే పరిశీలించి పార్కును అభివృద్ధి చేయాలని, పార్కును అభివృద్ధి చేసి అక్కడ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేసి, మధ్యలో రేకులతో నీడ కల్పించాలని, ఈ పార్కును సీనియర్ సిటిజన్స్ కు అప్పజెప్పాలని దాని నిర్వహణ వారే చూసుకుంటారని, అఖిలపక్ష ఐక్యవేదిక తరపున జిల్లా కలెక్టర్ కి, ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేస్తున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక తరపున డాక్టర్ సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు.

నిర్లక్ష్యానికి మారుపేరు మున్సిపల్ శాఖ Read More »

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి

వనపర్తి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జెడ్పి సీఈవో యాదయ్యతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 41 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి వనపర్తి మండలం చందాపూర్ గ్రామంలో జరిగిన భాను ప్రకాష్ భవ్య శ్రీ ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట కౌన్సిలర్ శ్రీకర్, చింటూ,కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక నాయకులు మరియు ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

ఆత్మశుద్ధి,పవిత్ర సంకల్పం కోసమే హజ్ యాత్ర

వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మైనారిటీ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్ ఆధ్వర్యములో జరిగిన హజ్ యాత్రికుల అభినందన సభలో పాల్గొని హజ్ యాత్రికులను ఘనంగా సన్మానించారు.హజ్ యాత్ర చేస్తున్న ఇంతియాజ్,గూడు.మహమూద్,అజీమ్,అబూ బకర్, అనీస్,సలీం,మతీన్,ఫరూక్,అజీజ్ ఖాన్,మాలిక్ ఖాన్,ఫైజాన్,మహమూద్,అజ్మత్ మరియు కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మశుద్ధి మరియు పవిత్ర జీవిత సంకల్పం కోసమే ముస్లిం సోదరులు హజ్ యాత్ర చేస్తారని అన్నారు. హజ్ యాత్రతో శక్తివంతమైన ఆత్మస్థైర్యం కలిగి లోక కళ్యాణం కోసం కృషి చేస్తారని పవిత్ర లక్ష్యంతో సాగే యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాబోవు రోజులలో తెలంగాణలో సుపరిపాలన రావాలని అల్లాను ప్రార్థించాలని ఆకాంక్షించారు. హజ్ యాత్రికులకు సన్మానం,విందు ఏర్పాటు చేసిన జోహెబ్ హుస్సేన్ ను అభినందించారు. ఈ కార్యక్రమములో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్,కౌన్సిలర్.శ్రీకర్ గౌడ్,బండారు.కృష్ణ,సమద్,స్టార్.రహీమ్,చిట్యాల రాము, యూసుఫ్, డ్యానియల్,హారీఫ్,ఏ.కె.పాషా,ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మశుద్ధి,పవిత్ర సంకల్పం కోసమే హజ్ యాత్ర Read More »

Scroll to Top