VETA NEWS MEDIA

2026-08-17
Offcanvas
Edit Template

వనపర్తి

దేశంలో బిజెపి పాలన మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, తరిమి కొట్టే సమయం ఎంతో దూరంలో లేదని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ అన్నారు. గురువారం వనపర్తి మండలం చిమనగుంటపల్లి, చిట్యాల, శ్రీనివాసపూర్ సిపిఐ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా తో స్వేచ్ఛ వ్యవసాయ వాణిజ్య ఒప్పందంతో రైతులను, 29 కార్మిక చట్టాలను రద్దుచేసి దేశ కార్మికులకు అన్యాయం చేశారన్నారు. నీట్ పేపర్ లీకేజీ తో విద్యార్థులు నిరుద్యోగులను ముంచారన్నారు. సీజెపి పోరాటంలో యువత ప్రజాగ్రహానికి నరేంద్ర మోడీ తలవగ్గక తప్పలేదన్నారు. ధరలను తగ్గిస్తామని అన్నింటికీ ధరలు పెంచి సామాన్యుడి బతకలేని పరిస్థితి కల్పించారన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయటం లేదన్నారు. వీటన్నింటిపై సిపిఐ ప్రజా చైతన్య యాత్రలో వివరిస్తుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే బిజెపిని కొట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు అన్నారు. శ్రీ రాము భాస్కరు గోపాలు కృష్ణవేణి శేఖర్ జయమ్మ చిన్న కుర్మన్న ఉదయ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 08 13 at 5.43.05 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top