VETA NEWS MEDIA

2026-09-17
Offcanvas
Edit Template

వనపర్తి

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలే కాకుండా, అదనంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలనే కాకుండా, ఇంకా అదనంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో సాగునీటి రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సహచర అబ్కారి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సోమవారం మోటార్లను ఆన్ చేసి ప్రారంభించారు. రూ.87.53 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని 18 తండాల పరిధిలో మొత్తం 4,235 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేయడంతో పాటు చెప్పని అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతోందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సుమారు రూ.36 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కర్నే తాండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంటూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి జిల్లాలో 3384 ఎకరాలకు, నాగర్ కర్నూల్ జిల్లాలో 851 ఎకరాలు కలిపి మొత్తం 4,235 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గిరిజనుల ఆకాంక్ష మేరకు ప్రాజెక్టు పేరును గిరిజనుల ఇష్టదైవం అయిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా పేరు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ఇదే కాకుండా పాలమూరు ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. అనంతరం వనపర్తి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ తో కలిసి సర్జ్ పూల్ వద్ద ప్రారంభమైన నీటి ప్రవాహానికి పూజలు చేసి పూలు సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 08 24 at 4.56.50 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top