VETA NEWS MEDIA

2026-09-17
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి మండలం పెద్దగూడెం శివారులోని తిరుమలయ్య గుట్ట మీద వెలసిన ఆరాధ్యదైవం తిరుమలనాతుణ్ణినీ మాజీ ఎం.పి రావుల.చంద్రశేఖర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానం పలికి ఘనంగా సన్మానించారు. శ్రావణ మాసం సందర్భంగా తిరుమలయ్య గుట్ట మీద అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి అని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారని రావుల అన్నారు. రాబోవు కాలములో కె.సి.ఆర్ గారి నాయకత్వములో నిరంజన్ రెడ్డి సహకారంతో తిరుమలయ్య గుట్టను పర్యాటక పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జాతరలో వెలసిన మిఠాయి దుకాణాలలో స్వీట్ ఖరీదు చేసి తనతో పాటు వచ్చిన భక్తులకు,నాయకులకు పంచి ఆనందాన్ని,బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. రావుల చంద్రశేఖరరెడ్డి గారి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్,ఉంగ్లం. తిరుమల్,ధర్మా నాయక్,మాధవ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,బీచ్యనాయక్, కృష్ణా నాయక్,నాగరాజు నాయక్,యాదయ్య, కొత్తకోట.బాలయ్య, లక్ష్మణ్ గౌడ్ శివప్రసాద్ గౌడ్ తదితరులు ఉన్నారు.

whatsapp image 2026 08 22 at 4.11.06 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top