VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

ప్రమాద బాధితుని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి ఘనపూర్ మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన అశోక్ చారి ఇటీవల ప్రమాదానికి గురై శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది అశోక్ చారిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు అనంతరం వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా సూచించారు. మాజీ మంత్రి వెంట నందిమల్ల అశోక్,మాజీ సర్పంచ్ నిర్మలమ్మ,కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్,సయ్యద్.జమీల్,నాగన్న యాదవ్,మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రమాద బాధితుని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

ప్రజా ప్రభుత్వంలో రైతులకు, మహిళలకు సమున్నత స్థానం

వనపర్తి ప్రజా ప్రభుత్వం రైతులకు, మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తోందని, సన్నారకం వరి ధాన్యానికి బోనస్ కల్పించి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి పేర్కొన్నారు. బుధవారం పార్లమెంటు సభ్యులు మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పెద్దమందడి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వీరు ఐకెపి ఆధ్వర్యంలో పెద్దమందడి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, వెల్టూరు గ్రామంలో ఏర్పాటుచేసిన రెండు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వడ్ల సంచిని తూకంపై పెట్టి కాంటా చేసి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతులకు, మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తోందని, సన్నారకం వరి ధాన్యానికి బోనస్ కల్పించి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. వరి ధాన్యం అమ్మకానికి వచ్చిన రైతులకు తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి టాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. రైతులకు వారం రోజుల్లో నగదు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఇచ్చి రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తోందని తెలిపారు. రైతులు ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.వెల్టూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన పలువురు లబ్ధిదారులకు ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేశారు. ఇల్లు లేని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తూ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, మాజీ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, డి ఆర్ డి ఓ ఉమాదేవి, డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాధ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వంలో రైతులకు, మహిళలకు సమున్నత స్థానం Read More »

పేదింటి అమ్మాయి వివాహానికి మాజీ మంత్రి గారి ఆత్మీయ కానుక

వనపర్తి వనపర్తి పట్టణాన్నికి చెందిన పేదింటి అమ్మాయి ఎన్.అమూల్య(విశ్వకర్మ) వివాహం ఈ నెల 26న జరగనుంది.ఇట్టి విషయాన్ని నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాగా స్పందించిన నిరంజన్ రెడ్డి గారు ఎన్.అమూల్యను ఆశీర్వదించి పుస్తే మెట్టే మరియు నూతన వస్త్రాలు అందించారు. ఆత్మీయ కానుక అందుకున్న అమూల్య కుటుంబ సభ్యులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో పలుస.రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్,కౌన్సిలర్.శ్రీకర్ గౌడ్,బంగారు.అనిల్,మోహనా చారి,ప్రసాదా చారి,చాణక్య చారి,నాగరాజు,రాము తదితరులు ఉన్నారు.

పేదింటి అమ్మాయి వివాహానికి మాజీ మంత్రి గారి ఆత్మీయ కానుక Read More »

చింతల ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి వనపర్తి పట్టణం చింతల ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి, సుఖసంతోషాల కోసం స్వామివారిని ప్రార్థిస్తూ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. కౌన్సిలర్ స్పీకర్ గౌడ్,రాము,స్థానిక నాయకులు,భక్తులు పాల్గొన్నారు

చింతల ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

వనపర్తి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఎంతగానో దోహదపడతాయని, అందుకే ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు టాలెంట్ ఫెస్ట్ నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వనపర్తి మర్రి కుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హాకీ మరియు క్రికెట్ సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ ఈరోజు నుండి ప్రారంభమై ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి కలెక్టర్ పాఠశాల వంటగదిని పరిశీలించారు. వంటగది పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలన్నారు. వంటగదిలో స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, మెస్ కమిటీకి చెందిన విద్యార్థులు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా అన్న విషయంపై విచారణ చేశారు. అలాగే సంక్షేమ వారోత్సవాల భాగంగా పాఠశాలలో నిర్వహిస్తున్న క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలను పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి, సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ సరస్వతి, పాఠశాల సిబ్బంది, అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి Read More »

వృద్ధులకు అండగా నిలవడం మన కర్తవ్యంవనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వృద్ధులకు అండగా నిలవడం మన కర్తవ్యంవనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చౌడేశ్వరి మాత వృద్ధాశ్రమానికి రెండు క్వింటాళ్ల బియ్యం వితరణ చేశారు. నిరంజన్ రెడ్డి తరపున బియ్యాన్ని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అందజేశారు.ఈ సందర్భంగా నందిమల్ల.అశోక్ మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి గతంలో వృద్ధాశ్రమానికి ఐదేండ్లు అల్పాహారం,భోజనం అందించారని అన్నారు. ఇటీవల ఆశ్రమ నిర్వాహకులు ఎస్.రాము తమకు సహాయం అందించాలని కోరగా స్పందించిన నిరంజన్ రెడ్డి రెండు క్వింటాళ్ల బియ్యం వితరణ చేస్తూ ఇతరత్ర అవసరాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అని నందిమల్ల అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గంధం.పరంజ్యోతి, సూర్యవంశం.గిరి,స్టార్.రహీమ్,సునీల్ వాల్మీకి,గౌడ్ నాయక్,కృష్ణయ్య,రాజు తదితరులు ఉన్నారు.

వృద్ధులకు అండగా నిలవడం మన కర్తవ్యంవనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

అమెరికా సామ్రాజ్యవాదంతో మానవ మనుగడకు ముప్పు వనపర్తి

అమెరికా సామ్రాజ్యవాదంతో మానవ మనుగడకు ముప్పు వనపర్తి అమెరికా సామ్రాజ్యవాదంతో ప్రపంచ మానవ మనుగడకే ముప్పని శాంతికాముకులు ఐక్యంగా ప్రతిఘటించి పోరాడాలని ఐప్సో, పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. వనపర్తి లో అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపిఎస్ఓ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ నుంచి రాజీవ్ చౌక్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. యుద్ధం వద్దు- శాంతి ముద్దు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ నేతలు ప్రజలు విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జిల్లా ఐఫ్సో ప్రధాన సమన్వయ కార్యదర్శి యత్తం శివ అధ్యక్షతన సభ నిర్వహించారు.ఎత్తం శివ, రమేష్, జలజ్వాల రాధాకృష్ణ,వనగంటి నాగేశ్వర్, భరత్, సీఎన్ శెట్టి పలుస శంకర్ గౌడ్,గంధంనాగరాజు, గణేష్, ఖాదర్ బాషా తదితరులు మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో పొరుగు దేశాలను ఆక్రమించి, దేశ నాయకత్వాన్ని అంతం చేసి భూగర్భ సంపదను నిక్షేపాలను స్వాధీనం చేసుకుంటుందన్నారు. వెనుజుల అధ్యక్షుడు మధురొ దంపతుల అక్రమ నిర్బంధం, ఇరాన్ అయతుల్లా ఖుమేని హతం ఇందులో భాగవేనన్నారు. అమెరికాతో సాంగత్యం ఉన్న అన్ని దేశాలు అమెరికా ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం వల్ల నాశనమయ్యాయి అన్నారు. వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని లక్షలాదిమంది క్షతగాత్రులు అయ్యారన్నారు. చాలా దేశాలతో పాటు భారతదేశంలో విపరీతంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతకానితనం కూడా దీనికి కారణం అన్నారు. యుద్ధాలను ఆపితేనే మానవ మనుగడ అభివృద్ధి సాధ్యమని ఆ దిశగా ప్రపంచ దేశాలు సంఘటితమై అమెరికా ఆట కట్టించాలన్నారు. రక్త పిపాసి అమెరికా సామ్రాజ్యవాదాన్ని పొదుముట్టించేందుకు శాంతికాముక దేశాలన్నీ ఏకం కావాలని కోరారు. అందుకు భారతదేశం ముందు వరుసలో నిలవాలన్నారు. నేతలు కళావతమ్మ, గట్టు యాదవ్,గోపాలకృష్ణ, జయమ్మ, లింగన్న, మధు,ఖాదర్పాష, వెంకటమ్మ, పరంజ్యోతి, వంశీ, అరవిందు, శిరీష, అరుణ జ్యోతి కాలేజ్ డి.ఎం.ఎల్.టి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

అమెరికా సామ్రాజ్యవాదంతో మానవ మనుగడకు ముప్పు వనపర్తి Read More »

Importance of Internships for Career Growth

Internships have become an essential part of career development for students and fresh graduates. They provide practical exposure to real-world work environments and help individuals understand industry expectations. Through internships, candidates can develop important skills such as communication, teamwork, and problem-solving. Employers also prefer candidates with internship experience, as it demonstrates initiative and practical knowledge. Choosing the right internship can significantly enhance career opportunities and build a strong professional foundation.

Importance of Internships for Career Growth Read More »

Resume Tips to Impress Recruiters

A well-crafted resume plays a crucial role in securing job opportunities. Recruiters often spend only a few seconds reviewing each resume, so it is important to make a strong first impression. Candidates should ensure that their resume is clear, concise, and highlights relevant skills and experience. Experts recommend using a professional format, avoiding unnecessary information, and tailoring the resume according to the job role. Including measurable achievements and maintaining proper structure can increase the chances of getting shortlisted. A strong resume is the first step toward a successful career.

Resume Tips to Impress Recruiters Read More »

Scroll to Top