VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

చికాగో అమరుల త్యాగాలను పరిహాసం చేస్తున్న కేంద్రం: సిపిఐ

వనపర్తి

అమెరికా చికాగో లో కార్మిక అమరుల ప్రాణత్యాగంతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి కేంద్ర బిజెపి ప్రభుత్వం పరిహాసం చేస్తోందని బుద్ధి చెప్పాలని కార్మికలోకానికి సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, వనపర్తి నియోజకవర్గకార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. వనపర్తిలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో 141 వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్రెమ్మ గుడి, పార్టీ ఆఫీస్, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్, టీచర్స్ కాలనీ చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో విజయ రాములు, కళావతమ్మ, చంద్రయ్య, పృథ్వి నాదం, ఎర్ర కురుమయ్య ఎర్రజెండాలను ఆవిష్కరించగా స్నేహ ఫుట్పాత్ సెంటర్, జిల్లా ఆస్పత్రి, మెడికల్ కాలేజ్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శాంతన్న, శ్రీను ఏఐటీయూసీ అరుణ పతాకాలను ఆవిష్కరించారు. 18 గంటల పరిధినాన్ని తగ్గించాలని, కనీస వేతనం ఇవ్వాలని అమెరికా చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు ఉద్యమించారన్నారు. పాలకులు జరిపిన కాల్పుల్లో చాలామంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అందులో ఒక కార్మికుడు తన శరీరం నుంచి కారుతున్న రక్తంలో తన అంగీని తడిపి ఎగరవేశారని అదే నేడు ఎర్రజెండాగా ప్రపంచ కార్మికులకు కష్టజీవులకు అండగా ఉండి పోరాడు పొందన్నారు. అమరుల పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని దినం ప్రపంచవ్యాప్తంగా అమలవుతుండగా భారత దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను లేబర్ కోడలుగా మార్చి పని దినం 12 గంటలకు పెంచటం దుర్మార్గమన్నారు. కార్మికుల శ్రమను సంపన్నులకు దోచి పెట్టేందుకే నరేంద్ర మోడీ 12 గంటల పని దినం చేశారని వ్యతిరేకంగా పోరాడాలి అన్నారు. స్వాతంత్ర కాలం నుంచి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా విభజించి వేతనం కోసం పోరాడే హక్కు, సంగం పెట్టుకునే హక్కు లేకుండా చేసిన నరేంద్ర మోడీ దుర్మార్గం ప్రభుత్వానికి కార్మికుల ఐక్యమై బుద్ధి చెప్పాలన్నారు. కార్మికులు సంఘటితంగా పోరాడితేనే వారి హక్కులు దక్కుతాయి అన్నారు. సిపిఐ, ఏఐటీయూసీ ఎర్రజెండాల కింద ప్రజలు కార్మికులు ఏకమై పోరాడాలని కోరారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సీనియర్ నేత కళావతమ్మ,సిపిఐ, ఏఐటీయూసీ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డిహెచ్పిఎస్ నేతలు చంద్రయ్య పృథ్వి నాదం గోపాలకృష్ణ ఎర్రకుర్మయ్య శేఖర్ మహేష్ వెంకటయ్య విష్ణు అశోక్ లక్ష్మీనారాయణ రాంబాబు శిరీష జ్యోతి సాయి లీల వంశీ రూప నరేష్ స్వామి శ్రీను నరసింహ శాంతయ్య నరేందర్ లక్ష్మి రాజేష్ శ్రీకాంత్ జలాల్ తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 05 01 at 3.29.13 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top