VETA NEWS MEDIA

2026-11-02
Offcanvas
Edit Template

వనపర్తి

రాబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి గారిని,జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి గారిని స్వయంగా కలసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అధిపతులుగా దయచేసి అన్ని శాఖల అధికారులు ఓటు నమోదు చేసుకోవాలని అప్రమత్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్,హైస్కూల్,జూనియర్ కళాశాలలో విస్తృతంగా పర్యటించి ఉపాధ్యాయులను, లెక్చరర్స్ తో మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం అని బాధ్యతగా మీతో పాటు పట్టభద్రులు అందరూ బాధ్యతగా ఓటు నమోదు చేసుకొనే విధంగా కృషి చేయాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన జిల్లాల దశాబ్ది ఉత్సవాల(జిల్లాలు ఏర్పడి 10ఏండ్లు అయిన)సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి గారిని మరియు జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి గారిని పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి గారిని పట్టణ అధ్యక్షులు పలుస. రమేష్ గౌడ్,జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి ని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పలుస.రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్,గంధం.పరంజ్యోతి,కురుమూర్తి యాదవ్,విజయ్ కుమార్,గంధం. బాలపీరు,జాతృ నాయక్,గులాం ఖాదర్ ఖాన్, కె.మాణిక్యం, భాను ప్రకాష్ రావు,వెంకట్ సాగర్,ఉంగ్లం. తిరుమల్,నాగన్న యాదవ్,ధర్మా నాయక్,మహేశ్వర్ రెడ్డి,జోహెబ్ హుస్సేన్, సయ్యద్.జమీల్,సూర్యవంశం.గిరి,చిట్యాల. రాము,నీలస్వామి,పెద్ద ముక్కల.రవి,బొబ్బిలి. ప్రేమ్ కుమార్, అస్లామ్,లక్ష్మణ్ గౌడ్, శివ గౌడ్,ఖాదర్ తదితరులు ఉన్నారు.

whatsapp image 2026 10 24 at 1.28.37 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top