VETA NEWS MEDIA

2026-11-02
Offcanvas
Edit Template

వనపర్తి

అహంకార పూరిత పాలన మాకు వద్దని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేమని నీ గర్వాన్ని అణిచివేసి గద్దె దింపి ఇంట్లో కూర్చోబెట్టిన నేటికీ నీ తీరు మారకపోవడాన్నీ వనపర్తి వనపర్తి ప్రజలు విజ్ఞులు మేధావులు గమనిస్తున్నారని రానున్న కాలంలోనూ నీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారూ
నవంబర్ 30న ప్రజాక్షేత్రంలో ఓటమిపాలైన ఓ మాజీమంత్రి తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ ఫోర్ అని చెప్పుకునే వ్యక్తి ఇటీవల మతిభ్రమించి అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని వయసుకు తగ్గిన మాటలు మాట్లాడాలని ఏడు పదుల వయసులో మీరు వెయ్యి మందితో వస్తే మేము 50 వేల మందితో వస్తామని దేనికైనా సిద్ధమని ఎమ్మెల్యే ఘాటు హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో 4వ నంబర్‌ నాయకుడిగా చెప్పుకునే మాజీ మంత్రి 2014 నుంచి 2023 వరకు వనపర్తిని అభివృద్ధి పేరుతో ధ్వంసం చేశారని మేఘారెడ్డి ఆరోపించారు. 32 మంది బీసీ నాయకులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టించారని, విలేకరులను సైతం వదలకుండా అట్రాసిటీ కేసులు నమోదు చేసిన రోజులను ప్రజలు మర్చిపోలేదన్నారు. నియోజకవర్గంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, నిరుద్యోగులు, వివిధ వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పాలనకు ప్రజలు చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పోస్టులకు ధరలు నిర్ణయించి కమిషన్లు వసూలు చేశారనే ఆరోపణలు కూడా చేశారు. గత పాలనలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారని మేఘారెడ్డి అన్నారు. నవంబర్‌ 30న జరిగిన ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు. జీవితంలో ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యారంటూ నిరంజన్‌రెడ్డిని ఎద్దేవా చేశారు. నాగర్‌కర్నూల్‌లో పుట్టి, కొల్లాపూర్‌లో పెరిగి, వనపర్తిలో రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి అహంకారానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో ఏం చేసిందో, కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్లలో ఏం చేస్తుందో ప్రజల సమక్షంలో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మేఘారెడ్డి సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ పాలనకు సంబంధించిన పత్రాలు తీసుకొచ్చి చర్చకు రావాలని, తాను ఎలాంటి పత్రాలు లేకుండానే చర్చించేందుకు సిద్ధమని అన్నారు. అభివృద్ధి విషయంలో ఎవరి పాలన ఎలా ఉందో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. వెయ్యి మందితో కలిసి నడిబజారులో చెప్పుతో కొడతానంటూ మాట్లాడటం ఏ విధమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. వయసులో పెద్దవారైనా మాటతీరు, ప్రవర్తనలో హుందాతనం ఉండాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు, అహంకారపూరిత వ్యాఖ్యలకు స్థానం లేదన్నారు. వనపర్తి విద్యావంతులు, విజ్ఞులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలను గమనించి ఆలోచించాలని కోరారు.
అహంకారంతో వ్యవహరించే నాయకుడు కావాలా, ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలా అన్నది ప్రజలే నిర్ణయించాలని అన్నారు.
ఎంతమందితో వచ్చినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మేఘారెడ్డి అన్నారు.వచ్చే ఎన్నికల్లో నిరంజన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ రావడం కూడా అనుమానమేనని, ఒకవేళ టికెట్‌ వచ్చినా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. వనపర్తి రాజకీయాల్లో బెదిరింపులు, వ్యక్తిగత దూషణల కంటే అభివృద్ధి, ప్రజాసేవే ముఖ్యమని పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా డిసిసి అధ్యక్షులు శివసేనారెడ్డి, జిల్లా పార్టీ కార్యవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 10 25 at 5.22.10 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top