వనపర్తి పర్యాటక రంగానికి మహర్దశ
వనపర్తి
వనపర్తి నియోజకవర్గంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను, పర్యాటక కేంద్రాలుగా, రిజర్వాయర్లలో బోటింగ్ సదుపాయం, బ్యూటిఫికేషన్ (సుందరీ కరణ)మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 14 కోట్లు విడుదల చేసి ముందుగా రూ.10 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు, ఈ మేరకు యువజన అభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ 2026 అక్టోబర్ 19న GO RT NO 313ను జారీ చేసింది. తొమ్మిది ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో వనపర్తి నియోజకవర్గంలోని వనపర్తి పట్టణం తిరుమలయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా గోపాల్‌పేట మండలంలోని బుద్దారం ఆలయంను, ఖిల్లా ఘణపురం మండలంలోని ఘణప సముద్రంను సుందరీ కరణతో పాటు బోటింగ్ ఏర్పాటు మామిడిమాడ నేరేడు చెరువు, వనపర్తి ఎంటీబీ నీ పర్యాటక, సుందరీకరణ పనుల అభివృద్ధి వెల్టూరు వేణుగోపాల సముద్రం చిన్నగుంటపల్లి గుండ్ల చెరువు శ్రీరంగాపురంలోని రంగసముద్రంను పర్యాటక కేంద్రగా వనపర్తి పట్టణం గ్రంథాలయం హాల్ కల్చరల్ సెంటర్ గా అభివృద్ధి నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పర్యాటక అభివృద్ధికి కీలక ముందడుగు వనపర్తి నియోజకవర్గంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు
