VETA NEWS MEDIA

2026-11-03
Offcanvas
Edit Template

వనపర్తి

బిజెపి నియంతృత్వ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, రక్షణకు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ హెచ్చరించారు. వనపర్తి అంబేద్కర్ చౌక్ లో అర్హుల ఓట్ల తొలగింపు, ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చౌక్ ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలిపారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. మాట్లాడుతూ. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తో బిజెపి వ్యతిరేక, విపక్షాల అనుకూల ఓట్లతో పాటుదళిత ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ ఓట్లను తొలగించి నామమాత్ర ఎన్నికల ద్వారా శాశ్వతంగా అధికారంలో ఉండాలని నరేంద్ర మోడీ బిజెపి కుట్ర చేస్తోందని ప్రతిఘటించి పోరాడుతామన్నారు. ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించినజ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, లేదా బర్తరపు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం కాపాడాలని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ యువత పోరాటం చేయడంతో దశాబ్దాలుగా పోరాట కేంద్రంగా ఉన్న జంతర్ మంతర్ ధర్నా చౌక్ ఎత్తివేసారని, ఇది బిజెపి నరేంద్ర మోడీ, కేంద్ర నియంతృత్వ, ప్రజాస్వామిక ధోరణికి సంకేతం అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తున్న యువకులు విద్యార్థుల బిజెపి గుండాలకు పోలీసు దుస్తులు తొడిగి అమానుషంగా దాడి చేయించడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు. వామపక్షాల అనుబంధ విద్యార్థి సంఘాల నేతలపై దాడులు అరెస్టులు, బిజెపి ఫాసిస్ట్ ధోరణికి నిదర్శనం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ప్రజా సమస్యలపై ధర్నా చేస్తుంటే ఏకంగా ధర్నా చౌక్ ని ఎత్తియటంతో, అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారని, తగిన మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది అన్నారు. తెలంగాణలో కెసిఆర్, ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ ధర్నా చౌక్లను ఎత్తేసి నియంతృత్వంలో ఒకే తాను ముక్కలని నిరూపించుకున్నారన్నారు. అణచివేత చర్యలు ప్రజాస్వామ్య ఉద్యమారను ఆపలేవని, మరింత ఉద్ధృతంగా పోరాటాలు సాగుతాయి అన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, జంతర్ మంతర్ ధర్నా చౌక్ ను పునరుద్ధరించాలని, ఢిల్లీలో విద్యార్థులు యువకులపై పోలీసుల ముసుగులో దాడులు చేసిన బిజెపి గుండాలను అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపాలని అంతవరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఓట్లు తొలగించడం, ధర్నా చౌక్ ఎత్తివేయటం, దాడులు , అరెస్టులు కేసులలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యమై ప్రజాస్వామ్య రక్షణకు తిరగబడాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరాము, కేతేపల్లి ఉప సర్పంచ్ కృష్ణవేణి, సిపిఐ నాయకులు పృధ్వి నాదం, ఎత్తంశివ, శేఖర్, చిన్న కురుమన్న, లక్ష్మీనారాయణ, జయమ్మ, మహేష్, విష్ణు, కుతుబ్, సురేష్, వంశీ, జ్యోతి, వెంకటమ్మ, కవీందర్ తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 10 13 at 3.20.50 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top