VETA NEWS MEDIA

2026-11-03
Offcanvas
Edit Template

వనపర్తి

బస్టాండులో వ్యాపారాలకు ఇచ్చే ప్రాధాన్యం ప్రయాణికుల సౌకర్యాలకు ఏదీ? ఆదాయం మీద ఉన్న శ్రద్ధ.. ప్రయాణికుల ఇబ్బందులపై ఎందుకు లేదు? నాలుగు దశాబ్దాలు గడిచినా వనపర్తి ఆర్టీసీ బస్టాండ్‌ రూపురేఖలు మారకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దసరా పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు పడుతున్న అవస్థలు చూసి చలించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు శనివారం బస్టాండ్‌ పరిసరాలను పరిశీలించి అధికారుల తీరుపై మండిపడ్డా బస్టాండ్‌ పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయినా శుభ్రతపై అధికారులకు పట్టింపు లేకపోవడం దారుణమని సతీష్‌ యాదవ్‌ విమర్శించారు. అపరిశుభ్ర వాతావరణం ప్రయాణికుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు తాగునీరు, కూర్చునే వసతి తదిత గతంలో రాజా రామేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జయరాములు హయాంలో ఏర్పాటు చేసిన బస్టాండ్‌ దశాబ్దాలు గడిచినా ఆధునికీకరణకు నోచుకోకపోవడంపై ఆయన నిలదీశారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌కే ఈ దుస్థితి ఉంటే ప్రయాణికుల సమస్యలను అధికారులు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. బస్టాండ్‌ అభివృద్ధిపై ఆర్టీసీ అధికారులు, జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రయాణికుల సమస్యలపై అఖిలపక్ష ఐక్యవేదిక పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్‌ సతీష్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకుడు వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకుడు కొత్తగొల్ల శంకర్‌, బీజేపీ నాయకులు రవి, రామస్వామి, తిరుపతి నాయక్‌, శివకుమార్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.ర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు.

whatsapp image 2026 10 10 at 11.12.24 am

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top