కుట్రలు ప్రలోభాలను అధిగమించి విజయం: వక్తలు
వనపర్తి
అధికార పార్టీ అండతో విపక్ష కూటమి కుట్రలకు ప్రలోభాలకు లొంగకుండా కార్మికులు హక్కుల కోసం పోరాడే ఈయూ కూటమికి విజయం అందించారని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మోష, ఎంప్లాయిస్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి బీకే విశ్వనాథ్, ఏ బీసీలు సి ఆర్ గౌడ్, ఎంఎన్ రావు, ఉద్యోగులు నీల స్వామి, వివి మూర్తి అన్నారు. రాష్ట్ర గుర్తింపు యూనియన్ గా భారీ మెజార్టీ ఓట్లు పొందిన నేపథ్యంలో శనివారం వనపర్తి డిపో వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మికుల హక్కులు సాధించే సత్తా ఈయూ కూటమికే ఉందని కార్మికులు నమ్మటమే విజయానికి కారణం అన్నారు. గతంలో చేసిన పోరాటాలను కార్మికులు గుర్తుపెట్టుకుని పెట్టుకొని ఓట్లు వేశారని పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంతో పోరాడి వారి సమస్యలు పరిష్కరించి హక్కులు సాధించి నమ్మకాన్ని నిలుపుకుంటామన్నారు. సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, ఆర్టీసీ ఈయూ, కూటమి నేతలు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగ ప్రముఖులు సూర్యనారాయణ రవి ఎడిసి ఎంఎన్ రావు, సి ఆర్ గౌడ్, నీల స్వామి, వీవీ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
