ఐప్సో బలోపేతానికి ప్రతి ఒక్కరు చేయి కలపాలి: శివ
వనపర్తి
ప్రపంచ శాంతి కోసం జిల్లాలో ఐప్సో(AIPSO) బలోపేతానికి సమిష్టి కృషి చేయాలని ఐప్సో జిల్లా సమన్వయ కార్యదర్శి ఎత్తం శివ, కవి జనజ్వాల కోరారు. వనపర్తి ఆఫీసులో ఐప్సో జిల్లా బాధ్యుడు నరసింహయ్య శెట్టి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మొదటి ప్రపంచ యుద్ధం మిగిల్చిన చేదు అనుభవాలు ఐప్సో ఏర్పాటుకు దారి చూపే అన్నారు. శాంతికాముకుల ప్రథమ సభ పారిస్, ఫ్రెండ్స్ నగరంలో జరిగిందన్నారు. ఆ నేపథ్యంలోనే భారత దేశంలో పార్టీల కతీతంగా ప్రపంచ శాంతి కోసం అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం(AIPSO) ఏర్పడిందన్నారు. నేడు ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్, అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయన్నారు. యుద్ధాలు మానవ మనుగడకే ప్రమాదంగా తయారయ్యాయని ప్రపంచ మానవ అభివృద్ధి శాంతితోనే సాధ్యమవుతుందని అందుకు ప్రతి ఒక్కరు చేయూతని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా సామ్రాజ్యవాద దేశాలు తమ వ్యాపారం కోసం దేశాల మధ్య యుద్ధాలను ప్రేరేపిస్తున్నాయని శాంతి కాముకులుగా మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఐప్సో జిల్లా మహాసభలు ఈనెల 24న వనపర్తి లో జరగనున్నాయన్నారు. ముఖ్య అతిథులుగా ఐప్సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేవీఎల్, నాగేశ్వరరావు, రామ్ రెడ్డి జిల్లా సభలకు సందేశం ఇచ్చేందుకు వస్తున్నారని, సభలను విజయవంతం చేయాలన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, కవి జనజ్వాల రాధాకృష్ణ, పృథ్వినాదం, సామాజిక కార్యకర్త గంధం నాగరాజు, గణేష్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
