నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనూహ్యంగా స్పందించిన రక్తదాతలు
వనపర్తి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలుచోట్ల యువకులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహించి సామాజిక సేవలో పాల్గొన్నారు. నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో బి.ఆర్.ఎస్ విద్యార్ధి, యువజన, సోషల్ మీడియా నాయకులు సూర్యవంశం.గిరి, హేమంత్ ముదిరాజ్, మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి, చిట్యాల రాము, జోహెబ్ హుస్సేన్ సహకారంతో 132యూనిట్ల రక్తసేకరణ నాగవరం యువత 60యూనిట్ల రక్తసేకరణ.
శ్రీరంగాపూర్ మండలం కంభాలపురంలో 21యూనిట్ల రక్తసేకరణ, సరోజినీ హాస్పిటల్ పెబ్బేరు 65యూనిట్ల రక్తసేకరణ మొత్తంగా 278యూనిట్ల రక్తసేకరణ చేయడం జరిగింది. అపాయ,అత్యవసర పరిస్థితులలో ఉన్న అభాగ్యులను ఆదుకోడానికి అనూహ్యంగా స్పందించి రక్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అభినందించి సన్మానించారు. హంగు,ఆర్భాటాలు లేకుండా పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.గోపాల్ పేట సర్పంచ్ కర్రోళ.స్వప్న భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరం విజయవంతం అయ్యింది మొత్తం 200మంది పరీక్షలు నిర్వహించగా 30మందికి ఆపరేషన్,72మందికి కళ్ళజోడులు అందించాలని నిర్ణయించారు. ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఒక మెమెంటో అందజేశారు.మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట నందిమల్ల.అశోక్, రాజేష్ గౌడ్, వడ్డెమాన్.రవి, సర్పంచ్ శేఖర్, మన్నే నాయక్ తదితరులు ఉన్నారు.
