VETA NEWS MEDIA

2026-10-09
Offcanvas
Edit Template

వనపర్తి

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది సామాన్య పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన హక్కు అని, ఆ హక్కును కాపాడటం ఎన్నికల కమిషన్‌ ప్రధాన బాధ్యత అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామక విధానం, ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ పరిగణనలోకి తీసుకోవాలని మేఘారెడ్డి కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను మరింత బలోపేతం చేసే విధంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితాలో ఒక్క అర్హుడి పేరు కూడా అన్యాయంగా తొలగిపోకూడదు. ఓటు హక్కు కోల్పోయిన ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి” అని మేఘారెడ్డి స్పష్టం చేశారు. SIR పేరుతో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కూడా వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, తొలగించబడిన అర్హులైన ఓటర్ల పేర్లను పరిశీలించి వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత ఉండాలని, పేరు తొలగింపునకు గురైన ప్రతి ఒక్కరికి కారణం తెలియజేయడంతో పాటు తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసుకునే అవకాశం కల్పించాలని మేఘారెడ్డి అన్నారు. పేదలు, సామాన్యులు, వలస కార్మికులు, వృద్ధులు తదితర వర్గాల ప్రజలకు ఓటు హక్కు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్ కుమార్‌ వ్యవహారశైలిపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌పై ప్రజల్లో విశ్వాసం పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, విశ్వసనీయత అత్యంత ముఖ్యమని ప్రజల ఓటుతో ఏర్పడే ప్రభుత్వాల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అనుమానాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించడం, SIR ప్రక్రియను రద్దు చేయడం, ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను కాపాడటం వంటి అంశాలపై ఇండియా కూటమి ప్రజల తరఫున తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఎమ్మెల్యే ప్రకటించారు. ఓటు హక్కు ప్రజల హక్కు.. దాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడుతాం అని మేఘారెడ్డి స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిలపక్ష పార్టీల నాయకులు సిపిఐ పట్టణ సెక్రెటరీ రమేష్, సిపిఎం జిల్లా సెక్రెటరీ పుట్ట ఆంజనేయులు, జబ్బార్, డి కురుమయ్య, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు రహీం, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా, బాబు గౌడు, గణేష్, మండ్ల రాజు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, కోళ్ల వెంకటేష్, బి. కృష్ణ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

whatsapp image 2026 10 03 at 3.19.47 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top