VETA NEWS MEDIA

2026-10-09
Offcanvas
Edit Template

వనపర్తి

హైద్రాబాద్,రంగారెడ్డి,పాలమూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఇట్టి సమావేశములో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యూహాలను ఉదాహరిస్తూ దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగులు,నిరుద్యోగులు తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి శ్రేణులు ఒక నెలపాటు శ్రద్ధ వహించి ఓటరు నమోదు చేయాలని ఆదేశించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ పట్టభద్రులు అందరూ తాజాగా ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. పార్టీ శ్రేణులు గ్రామ,గ్రామానా పట్టభద్రులను కలసి ఓటు నమోదు చేయించాలని అన్నారు 43నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది అన్నారు. సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్ ఎమ్మెల్సీ ఎన్నిక. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది కాబట్టి గెలుపు అవకాశాలు ఎక్కువ. అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయం శిరోధార్యం అని అన్నారు .

whatsapp image 2026 10 01 at 12.45.40 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top