VETA NEWS MEDIA

2026-10-09
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి జిల్లాకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK) తీసుకురావాలన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి ప్రత్యేక చొరవ ఫలించింది. సుమారు రూ.60 కోట్లతో ఏర్పాటు చేయనున్న TRVKకు పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో 40 ఎకరాల ప్రభుత్వ భూమికి అడ్వాన్స్ పొజెషన్ ఇస్తూ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఐఏఎస్ గారు Lr.No.E/1301/2025, తేదీ: 17-09-2026న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. TRVK కోసం సర్వే నంబర్ 280లో 10 ఎకరాలు, 281లో 30 ఎకరాలు, 164లో 10 ఎకరాలు కలిపి మొత్తం 50 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించగా, ఉత్తర్వుల ప్రకారం 40 ఎకరాలకు అడ్వాన్స్ పొజెషన్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ కేంద్రం ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, శాస్త్రీయ సలహాలు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల మార్గదర్శకత్వం, శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో రైతులు ఎదుర్కొనే వ్యవసాయ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపడంతో పాటు కొత్త సాంకేతికతను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో TRVK కీలకంగా ఉపయోగపడనుంది. వనపర్తి రైతుల అవసరాన్ని గుర్తించి ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లి, భూమి గుర్తింపు నుంచి అడ్వాన్స్ పొజెషన్ వరకు ప్రక్రియను వేగవంతం చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి కృషికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేసే ఈ కేంద్రం ఏర్పాటుతో రైతులకు ఆధునిక వ్యవసాయ విజ్ఞానం, సాంకేతిక సేవలు మరింత చేరువ కానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వనపర్తి లోని నంది హిల్స్ లో గల ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయంలో పెబ్బేర్ మండల నాయకులు, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారికి శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పెబ్బేరు మండలాధ్యక్షుడు యాపర్ల రామిరెడ్డి, అయ్యవారిపల్లి లక్ష్మణ్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వనపర్తి పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, జిల్లా జర్నల్ సెక్రెటరీ బ్రహ్మంచారి, కౌన్సిలర్లు శరవంద, పరుశురాం, చీర్ల జనార్ధన్ రవి యాదవ్, రఫీక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 10 04 at 2.37.19 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top