VETA NEWS MEDIA

2026-10-09
Offcanvas
Edit Template

వనపర్తి

సిపిఐ -సిపిఎం -సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ వామపక్ష పార్టీల జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ కీలుబొమ్మ గా ఎన్నికల వ్యవస్థలు దెబ్బతీస్తున్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ ఐ ఆర్ ను రద్దు చేయాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రదర్శన నిర్వహించి రాజీవ్ చౌక్ లో ఎర్రజెండాలతో నల్ల బ్యానర్ తో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి. జబ్బార్, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, సిపిఐ( ఎంఎల్ )మాస్ లైన్ జిల్లా కార్యదర్శి హనుమంతు లు పాల్గొని ప్రసంగిస్తూ దేశం ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటుందని పాసిస్తూ సంస్థ ఆర్ఎస్ఎస్ నియంత్రణలో ఉన్న బిజెపిని ఒక సాధారణ రాజకీయ పార్టీగా పరిగణించకూడదని ఆర్ఎస్ఎస్, బిజెపిలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ సహాయంతో దేశంలోని మొత్తం ఎన్నికల వ్యవస్థను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. జ్ఞానేశ్ కుమార్ జ్యోక్యాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ పరిస్థితులు చిన్న పెద్ద సమస్యలు ఏకమై పెద్ద ఎత్తున ఆత్మ రక్షణకు సిద్ధంగా ఉండాలి. రాజకీయ పార్టీలతో పాటు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న సామాజిక మానవ హక్కుల కార్యకర్తలు, కళాకారులు, మేధావుల మద్దతు కూడా కావాలని అన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకపోతే ఈ ఉద్యమం ఇక్కడితో ఆగబోదని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. సీ ఈసీ జ్ఞానేష్ కుమార్ కాకుండా బిజెపికి ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్ ప్రక్రియ వల్ల రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో బిజెపికి వ్యతిరేకంగా ఉండే 37 లక్షల ఓట్లను తొలగించడంతో బిజెపి అధికారంలోకి వచ్చిందన్నారు. తమిళనాడులో డీఎంకే ఓడిపోయిందని తెలిపారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే బిజెపి ఓడిపోయే పరిస్థితి ఉన్నందుని బిజెపి వ్యతిరేక ఓట్లు సుమారు పదమూడున్నర కోట్ల ఓట్లను ఈసీ తొలగించిందని విమర్శించారు. బిజెపి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఈసీ ద్వారా ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. సి ఈసి జ్ఞానేష్ కుమార్ గారి రాజీనామా చేయాలని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణం ఎస్ఐఆర్ ను రద్దు చేయాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రాజు అధ్యక్షతన జరిగింది. CPI జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, AITUC జిల్లా కార్యదర్శి మోష, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాబర్ట్, ఉపాధ్యక్షులు పృథ్వినాదం, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, లక్ష్మినారాయణ NFIW జిల్లా ఉపాధ్యక్షులు జయమ్మ,శిరీష, AISF జిల్లా ఉపాధ్యక్షులు వంశీ,ప్రసాద్, నాయకులు కృష్ణయ్య, వెంకటమ్మ,నాగమణి, లావణ్య,చంద్ర శేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. బాల్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.రాజు, ఆర్. ఎన్. రమేష్, బాల్య నాయక్, గుంటి వెంకటయ్య, ఎం. పరమేశ్వర చారి, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు ప్రసాద్,రాజు, గణేష్,కృష్ణవేణి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

whatsapp image 2026 10 01 at 7.33.51 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top