భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి
వనపర్తి
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, అక్రమంగా తొలగించిన 13 కోట్ల ఓటర్ల జాబితాను తిరిగి పునరుద్ధరించాలని, స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ పై మోడీ నియంత ధోరణిని వ్యతిరేకిస్తూ బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో సిపిఐ, కాంగ్రెస్,సిపిఐ (ఎం ఎల్), సిపిఐ (ఎం),టీ జె ఎ సి, ఎస్ పి, ఎం ఐ ఎం పార్టీల నేతృత్వంలో భారీ ర్యాలీ, అంబేద్కర్ చౌక్,ధర్నా చౌక్ మర్రి కుంట దగ్గర దిష్టి బొమ్మ దగ్ధం మరియు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా … ఆందోళనలో… రోడ్డుపై బేఠాయింపు… కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు నియోజకవర్గ కార్యదర్శి రమేష్ సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు జిల్లా కార్యవర్గ సభ్యులు ఇంటి జబ్బార్ సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ జిల్లా నాయకులు గణేష్, టీజేఏసీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా, ఎస్ పి పార్టీ జిల్లా అధ్యక్షులు బాబురావు, జిల్లా నాయకులు జానంపేట రాములు ఇండియా కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
