ముఖ్యమంత్రి సహాయ నిధిలో మేఘా మార్క్
CMRFలో 7,872 మందికి దాదాపు రూ.20 కోట్లు
LOC ద్వారా 469 మందికి రూ.91850000 కోట్ల వైద్యసాయం
వనపర్తి
ఒక పేద కుటుంబంలో అనారోగ్యం అంటే కేవలం ఒక మనిషి ఆరోగ్య సమస్య కాదు. ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి. ఆసుపత్రి ఖర్చులు ఎలా భరించాలో తెలియక, వైద్యం ఎక్కడ చేయించాలో అర్థంకాక, చివరకు ఎవరి సాయం కోరాలో తెలియని కుటుంబాలకు ఆ సమయంలో ఒక భరోసా కావాలి. అలాంటి ఆపద సమయంలో అన్నా అని పిలిస్తే.. “నేనున్నా” అంటూ ముందుకు వస్తున్నారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) ద్వారా నియోజకవర్గంలోని నిరుపేదలకు వైద్యపరమైన సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అనారోగ్యంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా, అర్హులైన వారికి ప్రభుత్వ సహాయం సకాలంలో అందేలా ఎమ్మెల్యే కార్యాలయం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి నిరంతరం సేవలందిస్తూ వస్తుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఇప్పటివరకు 7,872 మంది లబ్ధిదారులకు రూ.19,98,40700, అంటే దాదాపు రూ.20 కోట్ల మేర ఆర్థిక సహాయం అందింది. పేద కుటుంబాల్లో తీవ్రమైన అనారోగ్యానికి గురైన వారికి వైద్య ఖర్చుల భారాన్ని కొంతమేర తగ్గిస్తూ ఈ సహాయం అండగా నిలుస్తోంది 2026 అక్టోబర్ 2 నాటికి వనపర్తి నియోజకవర్గంలో CMRF కింద 7,872 మందికి రూ. 20 కోట్ల సాయం నేరుగా లబ్ధిదారులకు అందించారు. CMRFతో పాటు అత్యవసరంగా, ఖరీదైన వైద్యం అవసరమైన వారికి Letter of Credit (LOC) ద్వారా కూడా మేఘారెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటివరకు 469 మందికి రూ.9,18,50000 విలువైన LOC సహాయం అందించారు. అనారోగ్యంతో పోరాడుతున్న మనుషులు, వైద్య ఖర్చులతో సతమతమవుతున్న కుటుంబాలు, తమవారిని కాపాడుకోవాలనే ఆరాటంతో సహాయం కోసం ఎదురుచూసిన ఎన్నో జీవితాలు ఉన్నాయి. అందుకే ప్రతి దరఖాస్తును కేవలం ఒక ఫైల్‌గా కాకుండా, ఒక కుటుంబ సమస్యగా చూడాలన్న దృక్పథంతో ఎమ్మెల్యే కార్యాలయం వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సహాయం కోసం ప్రజలు వనపర్తి నుంచి హైదరాబాద్ వరకు తిరుగుతూ ఇబ్బందులు పడకుండా వనపర్తి, హైదరాబాద్‌లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి CMRF, LOC వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు శాసనసభ్యులు మేఘారెడ్డి బాధితులు ఇంటి వద్ద బయలుదేరినప్పటి నుంచి వాళ్లకు చికిత్స జరిగి తిరిగి ఇంటికి చేరుకునేంతవరకు ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలోనే సిబ్బంది ఎటువంటి ఇబ్బందు లు లేకుండా బాధితులను చూసుకోవడం గర్వకారణం దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాలు, సంబంధిత అధికారులతో సమన్వయం, తదుపరి చర్యలు.. ప్రతి దశలో బాధిత కుటుంబాలకు సహకారం అందించేలా ప్రత్యేక వ్యవస్థ కొనసాగుతోంది. CMRF కోసం ప్రతి నెలా సుమారు 1,200 నుంచి 1,500 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఎక్కడ జాబిల్లి లేకుండా ఆన్లైన్ చేస్తూనే వస్తున్నారు. మరోవైపు అత్యవసర వైద్య అవసరాలున్న వారికి ప్రతి నెలా సుమారు 15 నుంచి 20 LOC కేసుల పరిష్కారానికి సహకరిస్తున్నారు. వీటి ద్వారా తక్కువకు తక్కువ రూ.పదివేల సహాయం నుంచి రూ. ఐదు, ఆరు లక్షల వరకు సహాయం అందుకుంటున్నారు లబ్ధిదారులు అత్యంత ముఖ్యంగా.. పార్టీలకతీతంగా ఆపదలో ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి సహాయం అందేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అనారోగ్యం వస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితి రాకూడదని, డబ్బుల కొరతతో మంచి వైద్యం దూరం కాకూడదని.. ప్రభుత్వం అందించే సహాయాన్ని సకాలంలో ప్రజలకు చేరవేయడమే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధగా మారింది. అందుకే CMRF, LOC సేవలు వనపర్తి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఒక భరోసాగ నిలుస్తున్నాయి.
