అక్రమంగా వసూలు చేసిన డబ్బులు రికవరీ చేయాలి
వనపర్తి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్ )సీపీఎం పెబ్బేరు మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పెబ్బేరు మండల కన్వీనర్ మండ్ల రాజు సిపిఎం మాజీ ఎంపీటీసీ జి బాలయ్య గార్లు మాట్లాడుతూ పెబ్బేరు సంత 2025 జనవరి నుండి 2026 నేటి వరకు మున్సిపల్ నుంచి టెండర్ వేయడం లేదు కానీ కొంతమంది సంత కాంట్రాక్టర్లు పురపాలక సంఘం పేరుతో రసీదులు ముద్రించి మున్సిపాలిటీకి సంబంధం లేకుండానే అక్రమంగా రసీదులు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రతివారం 12 లక్షల నుంచి 14 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఇప్పటికీ సంత అక్రమంగా వసూలు చేసిన డబ్బులు మున్సిపల్ కు రావలసినది ఐదు కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసుకుని అటు మున్సిపాలిటీకి ఎటు ప్రభుత్వానికి కట్టకుండా అక్రమంగా వసూలు చేసుకుని కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటివరకు వసూలు చేసిన డబ్బులను వారిచే రికవరీ చేయాలని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం సంతలో అక్రమంగా వసూలు చేస్తున్న కొందరిపై మున్సిపల్ కమిషనర్ గారు ఫిర్యాదు చేయగా వారిపై కేసులు నమోదైనట్టు కమిషనర్ చెప్పారు అయినా వారిలో మార్పు రాకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు
