VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

అర్హుల ఓట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రెవల్లి గ్రామ పంచాయతీలో నాయకులతో కలసి “సర్”(ఓటర్ జాబితా సవరణ) జరుగుతున్న విధానాన్ని పరిశీలించి సమయం లేనందున బి.ఎల్.ఏలు ప్రత్యక్షంగా ప్రజలను కలసి వారికి అవగాహన కల్పించి తుది డ్రాప్టింగ్ లో ఖచ్చితంగా ఓటు నమోదు చేయించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ సరస్వతి గారిని అడిగి మండలములో జరుగుతున్న సర్ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలుసుకున్నారు. కొన్ని బూతులలో బి.ఎల్. ఓలకు ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల వారిపై తీవ్ర ఒత్తిడి ఉందని అవసరమైన సిబ్బందిని సమకూర్చి సకాలములో ఓటర్ జాబితా సవరణ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు నిరంజన్ రెడ్డి వెంట శివరామ్ రెడ్డి,ఖాజా, భాస్కర్ రెడ్డి,నిరంజన్,సుధాకర్ రెడ్డి,బి.ఎల్. ఓలు హైమావతి, హరీశ్వర్ రెడ్డి ఉన్నారు

whatsapp image 2026 07 13 at 7.32.39 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top