VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

విద్యార్థుల అందమైన చేతిరాత వారి భావి జీవితంపై చక్కని ప్రభావం చూపుతుందని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిజనవాడ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ చంద్రశేఖర్ గారి కోరిక మేరకు న్యూ స్కిల్ అకాడమీ తరుణ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక రోజు ఉచిత చేతిరాత శిక్షణ కార్యక్రమం లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పిల్లల అందమైన చేతిరాత వారిలో క్రమ శిక్షణను,ఏకాగ్రతను, తప్పులు లేకుండా రాసే చిత్తశుద్ధిని అలవాటు చేస్తుందన్న పరిశోధకుల అభిప్రాయాన్ని గుర్తు చేశారు.చక్కని చేతిరాత విద్యార్థులకు మంచి మార్కులను,గురువుల అభిమానాన్ని పొందేలా చేస్తుందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. హరిజనవాడ గెజిటెడ్ హెడ్ మాస్టర్ శ్రీ చంద్రశేఖర్ గారుతమ పిల్లలను ఈ వైపుగా ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన తెలిపారు పాఠశాలల తరుపున తరుణ్ మాస్టర్ ని ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ , ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు .ఈనాటి కార్యక్రమంలో చేతిరాత శిక్షణ నిపుణులు తరుణ్ మాస్టర్, సహాయకులు మీనా,పాఠశాల ఉపాధ్యాయులు రవి కుమార్, అరవింద్,విజయ్ కుమార్, రుక్ముద్దీన్, రంగనాయకమ్మ, నాగరాజు, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 07 07 at 4.42.49 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top