గ్రామ గ్రామాన పండగ వాతావరణం లో “SIR” కార్యక్రమం నిర్వహించాలి
వనపర్తి
గ్రామాల్లో పండగ వాతావరణంలో సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పెబ్బేరు పట్టణం, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పెబ్బేరు మండలం, శ్రీరంగాపురం మండలం, పెబ్బేరు పట్టణానికి వనపర్తి మండలం వనపర్తి పట్టణానికి చెందిన BLA-2 అవగాహన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఎన్నికల పరంగా అత్యంత కీలకమైనదని, ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త దీనిని అత్యంత బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఈ కార్యక్రమం ఒక పండుగలా జరిగేలా ప్రజలను భాగస్వాములను చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవలం BLAలు మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, సింగిల్ విండో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ తారతమ్యం లేకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమగ్ర ఓటరు జాబితా సవరణకు ఇంకా కేవలం 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని గుర్తు చేసిన వారు, ఈరోజు నుంచే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి ప్రతి అర్హుడి వద్ద SIR దరఖాస్తులు నమోదు చేయించాలని సూచించారు . ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఒక్క అర్హుడి ఓటు కూడా జాబితాలో చేరకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. ప్రభుత్వం మనదే కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, సీరియస్గా నిర్వహిస్తోందని, ఇందులో నిర్లక్ష్యం వహించే వారికి పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలు దొంగ ఓట్లను నమోదు చేయించేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని, అలాంటి ప్రతి ప్రయత్నాన్ని అప్రమత్తంగా అడ్డుకోవాలని సూచించారు. వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మన ఓటును మనం కాపాడుకుంటూనే మన కుటుంబ సభ్యులు, మన గ్రామ ప్రజలు, కాంగ్రెస్ అనుకూల ఓటర్ల ఓట్లను కూడా పరిరక్షించడం ప్రతి కార్యకర్త బాధ్యత” అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి వనపర్తి జిల్లాలో సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో BLA లు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు మార్కెట్ యార్డ్ చైర్మన్లు వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు
