పెళ్లికొడుకుకు నూతన వస్త్రాలు అందించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి
పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన కొమ్ము ఆంజనేయులు వివాహం సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శనివారం పెళ్లికుమారుడు ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మండల అధ్యక్షుడు వెంకటస్వామి, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి వివాహ ఏర్పాట్లు, కుటుంబ విశేషాలను అడిగి తెలుసుకున్నారు . నూతన దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో కొనసాగాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షిస్తూ పెళ్లికొడుకుకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గంగా రవి, మాజీ సర్పంచ్ వెంకటస్వామి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
