VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి బాలుర ఉన్నత పాఠశాల యందు “ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు.. సవాళ్లు.. పరిష్కారాలు” అనే అంశంపై “వనపురి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం చర్చాగోష్టి నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై జిల్లా ఉపాధ్యాయ సంఘాల నాయకత్వంతో ఒక చర్చ గోష్టి నిర్వహించడం బహుశా రాష్ట్రంలోనే ఇది ప్రధమం ఫౌండేషన్ చైర్మన్ శ్రీ బత్తుల శ్రీనివాసులు చర్చ గోష్టికి అధ్యక్షత వహించగా చర్చాగోష్టిలో ఎస్ చంద్రశేఖర్, ఎంఈఓ గోపాల్పేట్ మరియు గజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం వనపర్తి జిల్లా నాయకులు మాట్లాడుతూ 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 లక్షల విద్యార్థులు చదువుతూ ఉండగా, 12,000 ప్రైవేట్ పాఠశాలల్లో 37 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రధానంగా సోషియో ఎకనామిక్ ఇష్యూస్ కారణంగా తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్ని ఆశ్రయిస్తున్నారని, పరిస్థితిని మార్చాలని అన్నారు. ఎస్ వరప్రసాదరావు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ వనపర్తి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతను అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రుల వైఖరి మారాలని అన్నారు. అలాగే జెండర్ డిఫరెన్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో స్పష్టంగా ఆవుపడుతుంది అని తెలియజేశారు. బౌద్ధారెడ్డి పిఆర్టియు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ భద్రత కారణాల రీత్యా అమ్మాయిల విషయంలో కస్తూరిబాలను గురుకుల స్కూళ్లను తల్లిదండ్రులు ఆశ్రయిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల నమోదు విషయంలో సర్పంచులు చొరవ తీసుకునేలా మనం ప్రయత్నించాలని అన్నారు. సూర చంద్రశేఖర్ పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ బోధ నేతర కార్యక్రమాల కారణంగా ఉపాధ్యాయులు బాగా డిస్టర్బ్ అవుతున్నారని. దీన్ని అరికట్టాలని కోరారు.ఎస్ రవీందర్ గౌడ్ పి ఆర్ టి యు జిల్లా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విజయానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వం కలిసి సమన్వయంతో ముందుకు నడవాలని అన్నారు. డి కృష్ణయ్య యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ఉనికి ఉపాధ్యాయుల ఉనికితో ముడిపడి ఉందని, అందుకు అందరూ ప్రయత్నించి పాఠశాలల్ని కాపాడుకోవాలని, అలాగే ప్రభుత్వం కూడా తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేవిధంగా నియామకాలు జరపాలని అభిప్రాయపడ్డారు. టి మహిపాల్ రెడ్డి పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఎక్కడైతే ఉపాధ్యాయులు అంకితభావంతో సృజనాత్మకంగా పనిచేస్తున్నారో అక్కడ విద్యార్థుల నమోదు మెరుగ్గా ఉందని, అందుకు భిన్నంగా ఉన్నచోట పరిస్థితి బాగాలేదని, అందుకే ఉపాధ్యాయులు సమాజ భాగస్వామ్యం తో కలిసి నడవాలని, జవాబుదారుతనాన్ని కలిగి ఉండాలని, అప్పుడే నమోదు పెంచుకోగలమని అన్నారు. బి సుధాకర్ చారి, రూప్ వనపర్తి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ భాషలకు సంబంధించి విద్యార్థులు చదవడం రాయడం సరిగ్గా వచ్చి ఉండాలి, గణితంలో చతుర్విధ ప్రక్రియలు సాధించాలని, అలాగే పాఠశాలల ను అందంగా తీర్చిదిద్దాలని, అప్పుడే తల్లిదండ్రుల నమ్మకాన్ని చురగొనగలమని అన్నారు. అవసరమైతే జిల్లా అన్ని సంఘాల బాధ్యులతో టీం గా ఏర్పడి ప్రయత్నిద్దామని, అందుకు మేము సిద్ధమేనని అన్నారు. ఎస్ శ్రీనివాసరావు ఎస్ టి యు జిల్లా సీనియర్ నాయకులు మాట్లాడుతూ మంచి అంశాన్ని ఎజెండగా తీసుకున్నారని అభినందిస్తూ, ఎక్కడైతే గ్రామ సమాజ భాగస్వామ్యం సరిగ్గా ఉంటుందో అక్కడ మంచి ఫలితాలు వస్తాయని, యాంత్రికంగా పనిచేస్తే ఫలితాలు రావని, అందుకే ఉపాధ్యాయులు తదనుగుణంగా వ్యవహరించాలని అన్నారు. ఆర్ శ్రీనివాసులు టిపిఆర్టియు జిల్లా నాయకులు మాట్లాడుతూ తాను గతంలో పనిచేసిన పాఠశాలలో 7 మంది విద్యార్థుల సంఖ్య 65కు పెరిగిందని, మన పని విధానమే తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూడగొంటుందని అన్నారు. హరిప్రసాద్ ఎస్టియు జిల్లా సెక్రెటరీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కొరత పాఠశాలల్ని వేధిస్తుందని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఫలితం ఉంటుందని అన్నారు. ఆర్ నరసింహారావు ఎస్ జి టి ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఒక జట్టుగా పని చేయాలని, తమ కృషిని గ్రామస్తులకు కూడా అర్థం చేయించాలని, గ్రామ భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ లాంటి కొత్త నైపుణ్యాలను పాఠశాల అడాప్ట్ చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు క్రమక్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో, విద్యార్థుల నమోదును పెంపొందించుకునేటందుకు జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకత్వం పాల్గొని, నిర్మాణాత్మకంగా పలు సూచనలు చేయడం జరిగింది. అవసరమైతే ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు జట్టుగా ఏర్పడి కృషి చేద్దామని కూడా ముందుకు రావడం జరిగింది. బహుశా రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా కేవలం విద్యార్థుల నమోదుపై ఒక జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల అగ్రనాయకత్వం ఒక చర్చ గోష్టి నిర్వహించడం, చాలా సానుకూలంగా స్పందించడం శుభ పరిణామం. ఈ కృషి.. ఈ సమన్వయం ఇలాగే కొనసాగితే మంచి ఫలితాలు రాబట్టేందుకు విద్యార్థులు నమోదు పెంచేందుకు భవిష్యత్తులో దోహద పడుతుందని అన్నారు.

whatsapp image 2026 06 30 at 9.29.27 am

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top