ఉచిత పోలీస్ శిక్షణ ప్రవేశ పరీక్షలు
వనపర్తి
పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి,మధుకర్ స్వామి డి . సి పి సారధ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ నియామక శిక్షణ అందించేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ఆదివారం విజయవంతంగా జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాల్లో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా, వనపర్తి జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పరీక్షకు సుమారు 242 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి నాలుగు నెలల పాటు పూర్తిగా ఉచితంగా పోలీస్ నియామక శిక్షణ అందించనున్నట్లు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గద్దె భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గద్దె భాస్కర్ , సాహితి కళావేదిక అధ్యక్షులు శ్రీ శంకర్ గౌడ్ , సత్తార్ , శివలింగం , రమేష్ , ఉప్పరి తిరుమలేష్ , కండ్రెని వెంకటేష్ , బి. రాము పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గద్దె భాస్కర్ మాట్లాడుతూ, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రతినిధులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
