సూగురు ఉపసర్పంచ్ వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
పెబ్బేరు మండలం సూగురు గ్రామానికి చెందిన గ్రామ ఉపసర్పంచ్ ఉషాన్ వివాహానికి హాజరై నూతన వధూవరులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేసారు. అనంతరం కుటుంబ సభ్యులని, గ్రామ ప్రజల యోగ క్షేమాలు అడిగారు. గ్రామ మాజీ సర్పంచ్ వెంకట సేసమ్మ వేణుగోపాల్ యొక్క ఆరోగ్య పరిస్థితులను గ్రామ సర్పంచ్ యాదమ్మ పర్శరాం ద్వార తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వేణుగోపాల్ తో తనకు ఉన్న సంబంధాలను నెమరు వేసుకున్నారు. వేణు గోపాల్ కుమారుడి కి గుండె కు స్టంట్ వేసిన విషయాలను, తగు జాగ్రత్తలను తెలియజేసారు. కార్యక్రమం లో మండల అధ్యక్షులు వనం రాములు సోషల్ మీడియ కన్వీనర్ వడ్డె రమేష్,హనుమన్న, శ్రీను, మూర్తి,పులి, జయన్న, మధు యూత్ హర్ష, దశరథ్, రాంబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు
