ప్రతి నెల ఒకటో తేదీని వేతనాలు చెల్లించాలి_మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి
వనపర్తి
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ &వర్కర్స్ యూనియన్( CITU) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ యూనియన్ జిల్లా అధ్యక్షులు హనీప్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షడు, కార్యదర్శి, ఆర్యన్ రమేష్, మండ్ల రాజు మాట్లాడుతూ,, రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇచ్చిన మాట ప్రకారం గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,కనీస వేతనం 26,000 ఇవ్వాలి,51 జీవో ను రద్దచేయాలని,మరణించిన కార్మికుల కుటుంబానికి దహన సంస్కారాలకు 30 వేల రూపాయలు ఇవ్వాలని,గ్రామపంచాయతీ నిధుల నుండి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించాలని,కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని ,ఆన్లైన్లో లేని కార్మికుల పేర్లు వెంటనే ఆన్లైన్లోచేయాలని ,పెండింగ్ వేతనాలుచెల్లించాలని,కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఈఎస్ఐపిఎఫ్ బీమా సౌకర్యం కల్పించాలని పనిచేస్తున్న ప్రతి గ్రామపంచాయతీ కార్మికునికి శానిటేషన్ వస్తువులు సభ్యులు నూనెలు చెప్పులు దుస్తులు ఇతర సామాగ్రి ఇవ్వాలని,ప్రజా ప్రతినిధుల వేధింపులు అరికట్టాలని ఆక్రమ తొలగింపులను నిలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే రానున్న కాలంలో కార్మికులను సమీకరించి ప్రభుత్వమేన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్, జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు అనీఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జి పుష్ప నారాయణ శీను రామచంద్రయ్య చెన్నమ్మ విజయలక్ష్మి ఎల్లయ్య సుగ్రీవుడు పుల్లయ్య రాములు సిఐటియు జిల్లా నాయకులు మధు, తదితరులు పాల్గొన్నారు
