వేగంగా అడ్మిషన్లు పొందుతున్న
వనపర్తి
పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పొంది చదువుకోవడం వల్ల కలిగే లాభాల గురించి విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరిన విద్యార్థికి అడ్మిషన్ ఫీజు లేకుండా అడ్మిషన్ పొందడం, ఉచిత విద్య, స్కాలర్షిప్స్, ఉచిత పుస్తకాలు, ఈ సంవత్సరం నుండి మిడ్ డే మీల్స్ జూన్ నెల 12వ తారీఖున మొదట విడతగా 64 కళాశాలలో ప్రారంభమవుతుందని, నెల చివరి వరకు అన్ని కళాశాలలో టిఫిన్ తో పాటు మిడ్ డే మిల్స్ స్టార్ట్ అవుతుందని, విద్యార్థులపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం, ఇతర సౌకర్యాలు విద్యార్థులు పొందాలని సూచిస్తూ, కళాశాలలో చదివిన విద్యార్థులు మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారని ప్రవేటు కళాశాల దీటుగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు నిలుస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ, పెబ్బేరు ప్రభుత్వ కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడు సి కృష్ణయ్య , పెబ్బేరు ఎస్సీ వాడలో ఇంటింటి ప్రచారం చేస్తూ, పదో తరగతి పాసైన విద్యార్థుల అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది.
