పెబ్బేరులో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయాలంటూ వినతి
వనపర్తి
పెబ్బేరు పట్టణంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మండల అధ్యక్షులు యాపల రాంరెడ్డి గారు గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. గురువారం పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో పలు కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం వచ్చిన వారికి వారు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాంరెడ్డి, సురేందర్ గౌడ్, గంధం రంజిత్ కుమార్ భాను ప్రకాష్ స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
