VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తూ పెద్దమందడి,ఘనపూర్ మండలాల్లో పలు గ్రామాలలో ఐ.కె.పి సెంటర్స్,సింగిల్ విండో సెంటర్స్,మిగతా కొనుగోలు కేంద్రాలలో విస్తృతంగా పర్యటించి తడిసిన,మొలకెత్తిన ధాన్యాన్ని చూసి రైతులు పడుతున్న హరిగోస చూసి చలించిపోయిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులను ఓదార్చి దైర్యం చెప్పారు. రాష్టములో 5లక్షల 42వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని ప్రభుత్వం 90లక్షల ధాన్యం సేకరణ చేస్తున్నామని చెప్పి అందులో కూడా 40శాతం కొనుగోలు చేయలేదని విమర్శించారు. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల నిర్లక్ష్యం వైఫల్యం వల్ల రైతులు ధాన్యాన్ని అమ్మడానికి నెలలు నెలలుగా పడిగాపులు పడుతున్నారని రైతుల దీనస్థితి చూస్తే కడుపు తరుక్కు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలో విస్తృతంగా పర్యటించి రైతుల సాధకబాధకలను తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలెక్టర్ కి ఫోన్ లో మాట్లాడుతూ రైతుల అగచాట్లు హరిగోస వర్ణనాతీతం అని వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వేదికలను ఉపయోగించుకొని అందులో ధాన్యాన్ని నిలువచేసే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లారీలు, ట్రక్కులు లేని వారికి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు ఇచ్చారు అని విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తడిసిన,మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి వెంట జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్,మండల పార్టీ అధ్యక్షుడు రాళ్ల.కృష్ణయ్య,మన్నే గౌడ్,పులిందర్, పీన్య నాయక్,ప్రతాప్,శివ,లక్మన్,మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

whatsapp image 2026 05 27 at 3.07.52 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top