అధికారులదే బాధ్యత.. తరుగు లేకుండా తడిసిన ప్రతి గింజ కొనేదాకా పోరాటం : సిపిఐ
వనపర్తి
వనపర్తి జిల్లా కొనుగోలు కేంద్రాల్లో దాన్యం తడిచేందుకు అధికారులే బాధ్యులని, తడిసిన ప్రతి గింజ కొనేదాకా రైతుల పక్షాన పోరాడుతామని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ హెచ్చరించారు. ఆదివారం వనపర్తి మండలం చిట్యాల మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. మాట్లాడుతూ.. మార్కెట్లో 35 వేల బస్తాల ధాన్యం కాంటా వేసి లారీలు రాక నిల్వ ఉంచారన్నారు. సుమారు 6000 బస్తాల ధాన్యం ఇంకా తూకం వేయాల్సి ఉందన్నారు. రాత్రి వర్షానికి వేల సంఖ్యలో ధాన్యం బస్తాలు తడిసాయని, కాంటావెయ్యని సుమారు 6000 బస్తాల ధాన్యం రాశుల కిందకు నీళ్లు వచ్చి తడిసి పాడయ్యారు. 15 రోజుల క్రితమే 35,000 బస్తాలను తూకం వేసినా తరలించడంలో అధికారుల జాప్యం వల్లే రాత్రి వానకు వడ్లు తడిచాయని అందుకు పూర్తిగా అధికారులే బాధ్యులన్నారు. తడిసిన ధాన్యం ప్రతి గింజ తరుగు లేకుండా కొనాల్సిందేనని, తరలింపులో అధికారుల రైతులకు నష్టం చేస్తామంటే సహించేది లేదన్నారు. మార్కెట్ యార్డు మైదానం పలుచోట్ల పల్లంగా ఉందని వర్షం వచ్చిన ప్రతిసారి నీరు నిలుస్తుంది అన్నారు. పల్లంలో ఉన్న సంచులే అధికంగా రాత్రి వర్షానికి తడి సాయి అన్నారు. మార్కెట్ యార్డ్ మైదానం సమాంతరం చేయాలని గత సంవత్సరం కూడా కోరామని అయినా అధికారులు పట్టించుకోలేదన్నారు. చిట్యాల మార్కెట్ యార్డులో ఒకే చోట ఐదు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని వీటిని పిఎసిఎస్ ఐకెపి మెప్మా నిర్వహిస్తున్నాయన్నారు. కేంద్రాలకు స్థలాలు వేరువేరుగా లేకపోవడంతో ఒకేచోట రైతులు ఒకే చోట ధాన్యం పోస్తున్నారని, ధాన్యం కొనమంటే ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టుకుంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతుల సీనియార్టీ పాటించాలన్నారు.మార్కెట్కు ధాన్యంతెచ్చిన రైతుల సీనియార్టీ జాబితాను సిద్ధం చేసి, సీనియార్టీ ప్రకారం ధాన్యం కాంటా వేయాలనిడిమాండ్ చేశారు. హమాలీలు నిర్వాహకులు తమకు ఇష్టమైన వారి ధాన్యం ఆలస్యంగా తెచ్చిన ముందుగా కాంటా వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు. హమాలీల కొరత కూడా ఉండటం కూడా కారణమన్నారు చీమనగుంటపల్లి తాండ రైతుల ధాన్యం ఈనెల మూడవ తేదీన 14% తేమ వచ్చిన ఇంతవరకు కాంటావెయ్యలేదని. వారం రోజు తెచ్చిన వారి ధాన్యం కాంటా వేశారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు అన్నారు. మార్కెట్ యార్డులో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల వసతి లేదన్నారు. మరుగుదొడ్లున్న నీళ్లు లేక దుర్వాసన కొడుతున్నాయని మహిళలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే బాగు చేయాలన్నారు. రైతుల సమస్యలు తీరేవరకు సిపిఐ పోరాడుతుందన్నారు. సిపిఐ నాయకులు శేఖర్, వంశీ రైతులు పాల్గొన్నారు.
