ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
వనపర్తి
ఉమ్మడి గోపాల్ పేట రైతులు తాము ఆరుగాలం కష్టపడి పండించిన వరి,మక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని దాదాపు 4గంటల పాటు ఎర్రటి ఎండలో ధాన్యం రోడ్డుపై పారబోసి ధర్నాకి దిగారు. ధాన్యాన్ని తరుగు లేకుండా తడిసిన ధాన్యాని కూడా ప్రతి గింజతో సహా కొనుగోలు చేయాలని డిమాండ్ రైతులకు సంఘీభావం తెలిపిన జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ రైతులు ఉసురు పోసుకున్న రేవంత్ ప్రభుత్వం ఆగం కాక తప్పదు జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల కన్నీటితో తమ పంట తగలబెట్టుకుంటే ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. అకాల వర్షాలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్ల పాలు అవుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సహించరానిది అని దుయ్యబట్టారు.
జిల్లా కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇచ్చేదాకా ధర్నా విరమించమని రైతులు పట్టు బట్టారు. రైతుల ధర్నాకు అశోక్ చివరిదాకా ఉండి సంఘీభాం తెలిపారు. ఈ కార్యక్రమములో రమేష్ మాజీ సర్పంచ్,చంద్రశేఖర్,మన్నే నాయక్,రాజేష్,నరసింహ,తదితరులు ఉన్నారు.
