VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో మనిషి అవసరార్థం ఉపయోగపడేందుకు ఆసుపత్రులు ఎంతో అవసరమని ప్రజాసేవలో ఆసుపత్రులే మొదటి వరుసలో ఉంటాయని, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని 23 వార్డులో దంత వైద్యుడు ప్రణయ్ కుమార్ రెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన సమర్త్ సాయినాథ్ డెంటల్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వైద్య వృత్తిలో ఉండి నిరుపేదలకు సేవ చేయడం గర్వించదగిన విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైద్యులు నిస్వార్ధంగా వైద్య సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 05 13 at 1.14.21 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top