పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
ఖిల్లా ఘనపూర్ మండలం వెనకీ తండాలో జరిగిన మోహన్ నాయక్ జ్యోతివివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఘనపూర్ మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు శేఖర్ గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి గృహం సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి గారి వెంట మండల పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య , మాజీ ఏఎంసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్, మాజీ జెడ్పిటిసి సామ్యా నాయక్, సర్పంచులు రాజు నాయక్, నాగయ్య, భరత్ నాయక్, శంకర్ గౌడ్, చెన్నయ్య, లక్ష్మయ్య, ఆంజనేయులు గౌడ్, గోపాల్, పోలిశెట్టి ప్రతాప్, మల్లేష్, మాధవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
