నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
వనపర్తి
ఖిల్లా ఘణపురం మండలం సల్కేలాపురం గ్రామానికి చెందిన గొల్ల చెన్నయ్య గారి కుమారుడు శ్రీకాంత్ యాదవ్ వివాహానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయంలో వివాహ మహోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పెద్దల సమక్షంలో జరిగే వివాహ వేడుకలు కలకాలం అన్యోన్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
