VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

మన అభివృద్ధి సమాజ సేవకు ఉపయోగపడాలి

వనపర్తి

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామానికి చెందిన మిద్దె సుదర్శన్ హైదరాబాదులోని రాజేంద్ర నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మన మండలం నుండి హైదరాబాద్ లో వృత్తిరీత్యా స్థిరపడి ఉన్నత స్థానమైన బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం మనకు గర్వకారణం అని అన్నారు. జీవితములో ఉన్నతంగా ఎదిగిన తర్వాత పుట్టిన ఊరికి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూనే సమాజ సేవకు అంకితం కావాలని కోరారు. న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థాయిలో సుదర్శన్ రాణించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట నందిమల్ల అశోక్ ఉన్నారు.

whatsapp image 2026 05 01 at 3.06.03 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top