వనపర్తి
వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో మొదటి సంవత్సరం మార్కులు తెచ్చుకున్న జీవన్ సాయి 536 మార్కులు, గురు రాఘవేంద్ర 519 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో మొదటి మార్కులు తెచ్చుకున్న భారతి 518 మార్కులతో , పోల్కపాడులో ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానం సంపాదించిన విద్యార్థిని మౌనిక లను అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. పోల్కపాడు సర్పంచ్ బంగారయ్య, 22 వార్డు కౌన్సిలర్ భర్త శ్రీనివాసులు, బీఎస్పీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మై బూస్, టిడిపి నాయకులు కొత్తగొల్ల శంకర్, సుంద రామస్వామి, ఖాజా WNP ZPHS B ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, రవీందర్ గౌడ్, నరేష్,గురు రాజు యాదవ్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు తమ తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో కాకుండా ప్రభుత్వ స్కూల్లోని చదివించాలని వారిని మిగతావారు కూడా అనుసరిస్తారని ఎందుకంటే ప్రభుత్వ స్కూలల్లో నాణ్యవంతమైన టీచర్లు ఉంటారు… విద్యార్థులు డబ్బులు లేకుండా పాస్ అవుతున్నారు…. ప్రైవేట్ స్కూళ్లలో లక్షలు పెట్టి అన్యాయం అవుతున్నారు కనుక హైదరాబాదులో చదివించేవారు ఆలోచించి వనపర్తి లోనే చదివించాలని మేము విజ్ఞప్తి చేశారు.
