VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

వనపర్తి

తహసిల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ ఆత్మకూర్ తహసిల్దార్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులు, సాదా బైనమా పెండింగ్ దరఖాస్తులు సహా ఇతర పెండింగ్ అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచడం కోసం సంబంధిత అధికారులు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు విషయంలో నిర్లక్ష్యం లేకుండా పని చేయాలని ఆదేశించారు. తహసిల్దార్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి, సాదా బైనమా దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే స్పందించాలన్నారు. గ్రామాల్లో జరుగుతున్న పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. అధికారుల మధ్య సమన్వయం పెంచి సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు. SIR ప్రక్రియ నేపథ్యంలో BLOలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన బుధవారం అదనపు కలెక్టర్ అమరచింత మండల పరిధిలోని నాగల కడుమూరు, పామిరెడ్డిపల్లి, ఈర్లదిన్నె గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. టార్పాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచడంలో సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. హమాలీలకు సంబంధించి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లోడింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో తహసిల్దార్ జె కే మోహన్, రెవెన్యూ అధికారులు, GPOలు పాల్గొన్నారు.

whatsapp image 2026 04 29 at 2.11.28 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top