వనపర్తి
కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన పి.సి.ఘోష్ కమిషన్ నివేదిక నిబంధనలకు విరుద్ధంగా ఉందని కమిషన్ సిఫార్సుల మేరకు కె.సి.ఆర్,హరీష్ రావు గారిపై చర్యలు తీసుకోకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు. రెండున్నర ఏండ్ల నుండి కాలయాపన తప్పా అభివృద్ధి పథకాలు అమలు చేసింది లేదని కేవలం కెసిఆర్ మీద ఆరోపణలు చేయడానికి పాలన సాగించినట్లు ఉందని ఘాటుగా విమర్శించారు. గోదావరి జలాలు ఆంధ్రాకు తరలించడం కోసం రేవంత్ గురువు చంద్రబాబు నాయుడుకు లబ్ది చేయడానికి మేడిగడ్డ రిపేర్ చేయడం లేదని ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్న రేవంత్ చర్యలను గట్టు,శ్రీధర్ ఖండించారు. ఇప్పటికైనా కక్ష్య సాధింపు చర్యలు మానుకొని ఇచ్చిన420, హామీలు ,ఆరు గ్యారంటీలు కోసం కృషి చేయాలని హితవు పలికారు. ఈ నావేశములో నందిమల్ల.అశోక్,పరంజ్యోతి, జోహెబ్ హుస్సేన్,స్టార్.రహీమ్,సయ్యద్. జమీల్,,సూర్యవంశం.గిరి,చిట్యాల.రాము,రాజానగరం.సత్యనారాయణ,గంధం.కృష్ణ,తోట.శ్రీను ఉన్నారు.