VETA NEWS MEDIA

2026-08-17
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంటర్ లోAITUC, CITU, TUCI, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గంట పాటు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. పోలీసులకు కార్మిక సంఘాల నాయకులు మధ్య తోపులాట జరిగింది అనంతరం కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్మిక సంఘాల నాయకులను విడుదల చేయాలని కార్మికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకొని నినాదాలు చేశారు, పోలీసులు సొంత పూచీకత్ పై కార్మిక సంఘాల నేతలను విడుదల చేశారు, ఈ రాస్తారోకోను ఉద్దేశించి AITUC జిల్లా కార్యదర్శి మోష, ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ,CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు R N రమేష్,మండ్ల రాజు,TUCI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుర్మయ్య, అరుణ్ కుమార్, ఏఐకేస్ జిల్లా కార్యదర్శి రాబట్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేష్ ఆచారి జిల్లా ఉపాధ్యక్షులు జి ఎస్ గోపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ అజయ్, మేకల ఆంజనేయులు తెలంగాణ ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజన్న, వెంకటయ్య. మాట్లాడుతూ
కార్పొరేట్ల ఆక్రమణకు, న్యాయమైన వేతనాలను తిరస్కరించడానికి వ్యతిరేకంగా కార్మికులు, రైతుల ఐక్యతను చాటడమ. అన్ని పంటలను రాష్ర్ట ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేందుకు హామీ కల్పించడంతో పాటూ, సిటు ప్లస్‌ 50 ‌శాతం ఫార్ములాతో లెక్కించిన మేరకు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పి)ను ఇచ్చేందుకు చట్టబద్ధమైన హామీ కల్పించాలన్న డిమాండ్‌‌ దీనికి తోడు, నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాన్ని పెంచాలని, కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా తిరస్కరించాలని, ప్రతిపాదిత విత్తన బిల్లు, 2025ను ఉపసంహరించుకోవాలని, విద్యుత్‌ ‌ప్రైవేటీకరణ, ప్రీ పెయిడ్‌ ‌స్మార్ట్‌ ‌మీటర్ల ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్‌ నాలుగు లేబర్‌ కోడ్లను తక్ష‍ణమే రద్దు చేయాలి.కార్మికులందరికీ నెలకు రూ.31 వేలు చొప్పున కనీస వేతనం చెల్లించాలి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)ని పునరుద్ధరించి, 200 రోజుల పని దినాలు, రోజుకు రూ.700 దినసరి వేతనం అమల్జేయాలి.సార్వత్రిక సామాజిక భద్రత ఫించను నెలకు రూ.10 వేలు చొప్పున అందజేయాలి.ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ ప్రతిపాదించిన సి2 ప్లస్‌ 50 శాతం ఫార్ములాతో అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దేశ వ్యవసాయ రంగాన్ని ప్రమాదంలోకి నెట్టేసేలా అమెరికాతో చేసుకున్న అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలి.వ్యవసాయ, ఆహార శుద్ధి, ఆహార ఎగుమతులు, అలాగే వ్యూహాత్మక ఎంఎస్‌ఎంఇ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష‍ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)లను అనుమతించరాదు.భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఎ)ని రక్ష‍ించి మరింత బలోపేతం చేయాలి.ఎఫ్‌సిఐ గోదాముల స్థానంలో అదానీ – లీప్‌ ఇండియా గుత్తాధిపత్యానికి తెర దించాల విద్యుత్‌ ప్రయివేటీకరణ బిల్లు 2025, విత్తన బిల్లు 2025, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి. సహకార సంస్థల్లో కార్పొరేట్‌ సంస్థల ఆక్రమణలను ఆపేయాలి. అన్నదాతల నేతృత్వంలో ప్రజాస్వామిక సహకార సంస్థలను బలోపేతం చేయాలి.సమగ్రమైన రుణ మాఫీ పథకాన్ని ప్రకటించి అప్పుల ఊబిలో నుంచి గ్రామీణ ప్రజలను గట్టెక్కించాలి. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్ష‍ల చొప్పున పరిహారం అందజేయాలి. బలవంతపు భూసేకరణను, కార్పొరేట్‌ భూసమీకరణను ఎటువంటి పరిస్థిత్లోనూ చేపట్టకూడదు.భూ సేకరణ చట్టం 2013, అటవీ హక్కుల చట్టం 2006, పీసా 1996 చట్టాల ప్రకారం భూ హక్కులను పరిరక్ష‍ించాలి. ఎరువులు, ఇంధనం, వంటగ్యాసు, పెట్రోలు, డీజిల్‌ ధరలను నియంత్రించాలి. సబ్సిడీలను పునరుద్ధరించాలి. రైతులందరికీ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పంటల బీమా, పశువుల బీమా కల్పించాలివాటర్‌షెడ్లను అభివృద్ధి చేసి ప్రతి పొలానికి నీటి సౌకర్యం కల్పించాలి.వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పారదర్శకమైన సహాయాన్ని అందజేయాలి. ఇందుకోసం తగిన నిధులు కేటాయించాలి.విద్య కోసం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 6 శాతం నిధులు కేటాయించాలి.కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 6 శాతం, అలాగే జిడిపిలో 3 శాతం నిధులను పరిశోధన, అభివృద్ది రంగానికి కేటాయించాలి. ఈ కార్యక్రమం నికి సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి లీల, లక్ష్మి, డి హెచ్ పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, ఎంపీ ఆర్డీ నాయకులు మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో AITUC నాయకులు చిన్న కురుమన్న, శ్రీను, నరసింహ, నరేందర్,గాంధీ, పెద్ద మొగులయ్య,రిక్షా రాములు, టి యు సి ఐ నాయకులు గణేష్, పెంటయ్య దేవమ్మ,C రాజు, సిఐటియు నాయకులు బొబ్బిలి నిక్సన్, సూర్యవంశం రాము, బుచ్చమ్మ,ఎస్ రాజు,సునీత, శారద, కవిత తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 08 10 at 5.20.36 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top